ETV Bharat / state

ఆపత్కాలంలో డ్రోన్లదే కీరోల్ - ప్రజాభద్రతలోనూ సమర్థ వినియోగం - DRONES FOR DISASTER MANAGEMENT

'విపత్తు నిర్వహణకు డ్రోన్లు'పై చర్చలో వక్తలు

DRONES_FOR_DISASTER_MANAGEMENT
DRONES_FOR_DISASTER_MANAGEMENT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2024, 8:55 AM IST

AP Govt Used Drones To Deliver Food In Flood Affected Vijayawada : విజయవాడ వరదల సమయంలో డ్రోన్‌ సేవలను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుందని, ఇది అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమని వక్తలు కొనియాడారు. హెలికాప్టర్లు, పడవల ద్వారా వెళ్లలేని మారుమూల ప్రాంతానికీ డ్రోన్‌ ద్వారా ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేశారని కొంత మంది ప్రముఖులు వ్యాఖ్యానించారు.

ఆకాశంలో అద్భుతం - అమరావతిలో డ్రోన్​షో అదుర్స్​

విపత్తు నిర్వహణకు డ్రోన్లు : డ్రోన్‌ సమిట్‌లో భాగంగా మంగళవారం సాయంత్రం ( అక్టోబర్​ 22న) ‘మెరుగైన ప్రజాభద్రత, సమర్థంగా విపత్తు నిర్వహణకు డ్రోన్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో పలువురు నిపుణులు పాల్గొన్నారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్ల ద్వారా సేవలందించామని మారుత్‌ డ్రోన్స్‌ సీఈఓ ప్రేమ్‌కుమార్‌ వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగించడం ఏపీ నుంచే మొదలైందని పేర్కొన్నారు. విపత్తులు వచ్చినప్పుడు మొబైల్‌ సిగ్నల్‌ (Mobile signal) లేని ప్రాంతాల్లోనూ డ్రోన్‌ ద్వారా సేవలు అందించే వీలుంటుందని సమన్వయకర్తగా వ్యవహరించిన సుధీర్‌ వర్మ పేర్కొన్నారు. వరదల సమయంలో మునిగిన పొలాల ఫొటోలు తీసి, వాటి ఆధారంగా పరిహారం అంచనా వేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయని మనోజ్‌ వివరించారు.

'మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు - 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే రెడ్ వింగ్ డ్రోన్లు'

అలర్ట్‌ మెకానిజం రావాలి : ప్రజాభద్రతలో భాగంగా ఏపీలో క్రౌడ్‌ మోనిటరింగ్, నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్నామని శాంతి భద్రతల విభాగం ఐజీ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. డ్రోన్ల ఆధారంగా గంజాయి ఎక్కడ పండిస్తున్నారో గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సముద్ర తీరానికి వెళ్లి ఏటా 100 మందికి పైగా చనిపోతున్నారని, బీచ్‌ మోనిటరింగ్‌ కోసం డ్రోన్లను వాడుతున్నామని తెలియజేశారు. విపత్తుల కాలంలో ప్రజలకు సూచనలు ఇవ్వడానికి అలర్ట్‌ మెకానిజం అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు. కంపెనీలు ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజా భద్రతలో భాగంగా ఏదైనా సమస్యపై కాల్‌సెంటర్‌కు ఫోన్‌ వచ్చిన వెంటనే డ్రోన్‌ పంపి అక్కడి పరిస్థితికి అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చని ఐడియా ఫోర్జ్‌ టెక్నాలజీ వైస్‌ ప్రెసిడెంట్‌ విశాల్‌ సక్సేనా వివరించారు.

మంగళగిరిలో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిట‌ల్‌గా మార్చాలని నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.