Govt Measures for Essential Commodities Distribution on Subsidy: రైతుబజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఏ-గ్రేడ్ కందిపప్పు కేజీ 160 రూపాయలు రెండు రకాల నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని కిలో 48 , 49 రూపాయల చొప్పున ప్రజలకు అందిస్తోంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి సరకులు పంపిణీ చేస్తుంది.
నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్‌లో తొలి కౌంటర్‌ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరకులను రాయితీపై అందిచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పంచదార, సహా పలు చిరుధాన్యాలనూ రాయితీపై పంపిణీ చేస్తామన్నారు.
గోదావరి దాటిస్తున్న అనుమతుల్లేని బోట్లు- తరచూ ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన - BOAT LICENSE
వైఎస్సార్సీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు ఊరట కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రైతుబజారులో రాయితీపై కందిపప్పు, బియ్యం విక్రయాలను కలెక్టర్‌తో కలసి ఆయన ప్రారంభించారు. పాత గుంటూరులోని రైతుబజార్‌లో బియ్యం, కందిపప్పు విక్రయాలను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. మచిలీపట్నంలోని రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర రైతుబజార్లను గత వైఎస్తార్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
ధరల నియంత్రణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. ప్రజలకు రాయితీపై సరుకులు పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు చిన్నబజార్ వద్ద రిటైల్ దుకాణాన్ని స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన శాఖ మాత్యులు సంధ్యారాణి ప్రారంభించారు. విజయనగరం దాసన్నపేట రైతుబజార్లో సంయుక్త కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే అదితి విజయ లక్ష్మి గజపతిరాజు రాయితీ కందిపప్పు, బియ్యాన్ని అందజేశారు. ప్రజలు ఆకలితో పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.