ETV Bharat / state

మారుమూల గ్రామాలకు 4జీ​ సేవలు - సెల్‌ సిగ్నల్‌ సమస్యకు ఇక చెల్లు - CELL PHONE TOWERS IN VILLAGES

2,305 సెల్‌ టవర్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కసరత్తు

CELL_PHONE_TOWERS_IN_VILLAGES
CELL_PHONE_TOWERS_IN_VILLAGES (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2024, 10:24 AM IST

AP Govt Focuse Cell Phone Towers Arrangements in villages : మారుమూల గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్‌ సిగ్నల్స్‌ కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కొత్త సెల్‌ టవర్లను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇప్పటికీ కూడా కొండ వాలు, మారుమూల గిరిజన ప్రాంతావాసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కోసం టవర్‌ వెతుక్కుంటూ పరుగులు పెట్టే పరిస్థితి ఉంది. వారికి ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం 2,305 చోట్ల కొత్తగా 4జీ సెల్‌ టవర్లను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వీటిని ఏర్పాటు చేస్తోంది. కొన్ని సెల్‌ టవర్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు రంగ టెలికాం సంస్థలకూ ప్రభుత్వం అప్పగించింది. అలాగే 5జీ సేవలనూ అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రన్న సర్కార్​ చర్యలు చేపట్టనుంది.

గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు చర్యలు: సీఎం జగన్

టవర్ల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు : రాష్ట్రంలో కొత్త టవర్ల ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలకూ 4జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాటి ద్వారా 5,423 మారుమూల గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వేగవంతమైన సెల్‌ఫోన్ సిగ్నల్స్​, ఇంటర్నెట్‌ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా 2,271 లొకేషన్లలో టవర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కూటమి ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్స్‌కు (DoT) స్వాధీనం చేసింది. మరో 34 లొకేషన్లలో స్థలాలను నెల రోజుల్లో అందించనట్లు సమాచారం.

కొత్తగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 236 టవర్లును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. యాస్పిరేషన్‌ డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం (ADP) కింద కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం, విజయనగరం, వైఎస్‌ఆర్‌ జిల్లాలకు ఆ జాబితాలో చోటు కల్పించింది. ఈ ప్రాంతాల్లో 4జీ నెట్‌వర్క్‌ సేవల కోసం 701 టవర్లు, సంతృప్తికర స్థాయిలో (Saturation) 4జీ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు 1,368 టవర్లను ఏర్పాటు చేస్తోంది.

అనుమతి లేకుండా హైటెన్షన్​ విద్యుత్​ స్తంభాలు - ప్రశ్నిస్తే బెదిరింపులు - High Tension Electricity

కొత్త టవర్ల ఏర్పాటుతో పాటు 5జీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా 5జీ స్మాల్‌ సెల్స్‌ ఆన్‌ స్ట్రీట్‌ ఫర్నిచర్‌ (Small Sells Furniture on the Street) ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి సెల్‌ సిగ్నల్స్‌ అందించేందుకు వీలు ఏర్పడుతుంది. విస్తృత నెట్‌వర్క్‌తో పాటు వేగవంతంగా కనెక్టివిటీ అందించడం సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకే సమయంలో ఎక్కువ మంది ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్‌వర్క్‌ అందించడం సాధ్యం అవుతుంది. దీని కోసం జీఐఎస్‌ (GIS) ద్వారా మ్యాపింగ్‌ చేసే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఆ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి వీలుగా 5జీ ఇన్‌ఫ్రా మొబైల్‌ యాప్‌ను (5G Infra Mobile App) అభివృద్ధి చేసింది.

కోత దశలో పంటను ధ్వంసం చేసి విద్యుత్ టవర్ల నిర్మాణం - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.