AP Govt Employees Union Complains to CEO about Transfer of Teachers: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా విద్యాశాఖలో టీచర్ల బదిలీ చట్టం చేస్తామంటూ కొందరు అధికారులు ప్రతిపాదించటంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎన్నికల సీఈఓకి ఫిర్యాదు చేసింది. శాసనసభ కాలపరిమితి ముగిశాక, శాసనకర్తలు లేకుండా అధికారులు చట్టం ఎలా చేస్తారంటూ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) ఎన్నికల సీఈఓకి చేసిన ఫిర్యాదులో పేర్కోన్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలపై చట్టానికి ప్రతిపాదించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో స్పష్టం చేశారు.
పాఠశాల విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మొవ్వా రామలింగం సర్వాంతర్యామిలా వ్యవహరిస్తూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పరిధి దాటారని ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం కోరింది. ఈ చర్య ప్రత్యక్షంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఫిర్యాదు సూర్యనారాయణ ఫిర్యాదులో పేర్కోన్నారు. సీసీఏ రూల్స్ ప్రకారం పాఠశాల విద్యాశాఖ జేడీ ఎం.రామలింగంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సాధారణంగా జరిగే బదిలీ అనే అంశాన్ని తీసుకుని దీనిమీద చట్టం చేస్తున్నామని ఈ ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా కొత్త విధానం చేసేటువంటి అధికారం కాని శాసనాలు చేసే అధికారం గాని ఎగ్జిక్యూటివ్‌లో ఉందే అధికారులకు లేదు కదా. కాని ఎవరి ఆదేశాల ఉన్నాయని కొత్త చట్టం చేస్తున్నామని సూచనలు ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. వీళ్లు చేసిన చర్య ఏపీ సీసీ రూల్స్‌కి విరుద్ధంగా ఉంది కాని వారి హోదాలో లేని పనులను ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి సీసీఏ రూల్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అధేవిదంగా ఎన్నికల కోడ్ రూల్స్ పరిధి దాడి ఉంది కాబట్టి ఎన్నికల అధికారి కూడా తక్షణమే స్పందించి వారి మీద చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరుతున్నాం. ఈ చట్టాన్ని చేస్తామని బహిరంగంగా చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇలాంటి వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.- కేఆర్ సూర్యనారాయణ , ఐక్యవేదిక అధ్యక్షుడు