ETV Bharat / state

74శాతం పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు-​ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే సమాచారం ఉంది!: ముఖేశ్ కుమార్ మీనా - Mukesh Kumar Meena - MUKESH KUMAR MEENA

AP EC CEO Mukesh Kumar Meena: పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. అన్ని ప్రాంతాలకు సిబ్బందిని పంపిస్తున్నామన్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి బలగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామంటున్న ఏపీ సీఈవోతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

AP EC CEO Mukesh Kumar Meena
AP EC CEO Mukesh Kumar Meena (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 3:52 PM IST

AP EC CEO Mukesh Kumar Meena: రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని తెలుసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక అప్లికేషన్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఏపీ ఓటర్లను సరిహద్దుల వద్ద ఎవరు అడ్డుకున్నా చర్యలు తీసుకుంటామన్నారు. వంద శాతం పోలింగ్ లక్ష్యమంటున్న ఏపీ సీఈవోతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కామ్: పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. జీరో ,వయొలెన్స్, నో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని స్పష్టం చేసింది. 74 శాతం మేర పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కామ్ పెట్టామని వెల్లడించింది. పోలింగ్ స్టేషన్ల లోపలా.. బయటా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపింది. పోల్ డేటా మానిటరింగ్ సిస్టం- యాప్ ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని తెలిపారు. కొన్ని చోట్ల కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారనే సమాచారం వస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీస్ అబ్జర్వర్లు, జనరల్ అబ్జర్వర్లను ఈసీ నియమించింది. 20 శాతం మేర అదనంగా ఈవీఎంలు వచ్చాయన తెలిపింది.

ప్రయాణికుల ఇబ్బందులు: సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించే మెకానిజం ఏర్పాటు చేసుకున్నామని తెలిపింది. గతం కంటే ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం జరిగిందని తెలిపింది. ఈసారి 90 శాతం మేర పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. దూర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు రాకుండా చూస్తామని వెల్లడించింది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని ఆర్టీసీ ఎండీతో మాట్లాడామని తెలిపింది. ఎన్నికల సిబ్బంది నిమిత్తం కొన్ని ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నామని వెల్లడించింది. వృద్ధులకు, దివ్యాంగులకు పోలింగ్ స్టేషన్లల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 46,389 కేంద్రాలు, 4.14 కోట్ల ఓటర్లు - ప్రశాంత పోలింగ్​పై ఈసీ నజర్ - AP ELECTIONS 2024

వేళ్లపై ఇంకు గుర్తు వేస్తే కఠిన చర్యలు: ఓటర్లను ఎన్నికలకు రాకుండా చేసేలా ఎవరైనా వేళ్లపై ఇంకు గుర్తు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని మీనా తెలిపారు. ప్రభుత్వం మాత్రమే చెరగని సిరా తయారుచేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్దే అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా ఇతర సిరాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం :ముఖేశ్​ కుమార్​ మీనా - AP CEO Mukesh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.