AP EAPCET Entrance Exam 2024: రాష్ట్రంలో రేపటి నుంచి జరగనున్న ఏపీ ఈఏపీసెట్- 2024 ప్రవేశ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 49 రీజనల్ సెంటర్ల పరిధిలో ఎంపిక చేసిన 142 సెంటర్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్ష కోసం రికార్డు స్థాయిలో 3,61,640 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని హేమచంద్రా రెడ్డి వివరించారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చూసుకోండిలా - ap intermediate 2024 results
One Minute Late Not Allow The Exam Hall: విద్యార్థుల సౌలభ్యం కోసం హైదరాబాద్‌లో కూడా రెండు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలు ఈ నెల 16 నుంచి 23 వరకు ప్రతిరోజు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తున్నామని హేమచంద్రా రెడ్డి పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో 4 సెషన్స్‌లో, ఎంపీసీ విద్యార్థులకు ఈ నెల 18 నుంచి 23 వరకు 9 సెషన్స్‌లో నిర్వహిస్తున్నామని వివరించారు.
రోజుకు రెండు సెషన్స్‌లో నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంట్రన్స్ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని హేమచంద్రా రెడ్డి సూచించారు. ప్రతి హాల్ టికెట్ వెనుక భాగంలో సెంటర్ రూట్ మ్యాప్‌ను ముద్రించడం కూడా జరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి ఏవైనా మీ దగ్గర ఉంటే వెంటనే వారిని పరీక్ష రాయనివ్వకుండా డీబార్ చేస్తామని హేమచంద్రారెడ్డి తెలిపారు.
ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంట్రన్స్ కోసం గత ఏడాది మే 15 నుంచి నాలుగురోజుల పాటు అంటే 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. అలాగే వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ఎంట్రన్స్‌కు మే 22, 23 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. EAPCETకి మొత్తం 3,38,739 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షకు 2లక్షల 24వేల 724మంది పరీక్ష రాయగా 1లక్షా 71వేల 514మంది ఉత్తీర్ణత సాధించారు.
AP EAPCET 2023: ఏపీ ఈఏపీసెట్ 2023 ఫలితాలు విడుదల.. అబ్బాయిలు అదరహో