YS Jagan seek CBI court permission : పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక చేసుకున్నారు. ఈనెల 13న పోలింగ్ జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోర్టును ఏపీ సీఎం కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. జగన్ అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టు రేపు విచారణ జరపనుంది.
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన సీఎం జగన్ - YS Jagan court permission on Abroad
YS Jagan seek CBI court permission : ఏపీ సీఎం జగన్ ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన కోర్టు, విచారణ రేపటికి వాయిదా వేసింది.
Published : May 8, 2024, 6:15 PM IST