AP CM Chandrababu Visit To Polavaram Project : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పోలవరానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్నీ పరిశీలించనున్నారు. వాటి ప్రస్తుత స్థితిగతులను తెలుసుకున్న తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
పోలవరం పనులు పరుగులు పెట్టించాలనే సంకల్పన: చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారాన్ని పోలవారంగా నిర్దేశించుకుని ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్నీ చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు.
అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. అవసరమైతే దిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోను, అధికారులతోనూ మాట్లాడి సమస్యల పరిష్కారానికి అడుగులు వేశారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం సవాళ్లను పరిష్కరించి పనులు పరుగులు పెట్టించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు.
పోలవరం ప్రాజెక్ట్ను గాడిలో పెట్టేందుకు నిర్ణయం : గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో 72 శాతం మేర పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తీ చేసిన విషయం తెలిసిందే. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో పోలవరం విధ్వంసం జరిగిందని ఆరోపించిన చంద్రబాబు నాయుడు తిరిగి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద క్షేత్ర స్థాయి పర్యటనకు చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై స్వయంగా పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9.30కి ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్నీ పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకోనున్నారు. అనంతరం తదుపరి కార్యచరణ వెల్లడించనున్నారు.
నన్ను జైలుకు పంపినందుకు నేను చేయబోయేది ఇదే : ఏపీ సీఎం చంద్రబాబు - AP CBN Fires IAS And IPS