AP and Telangana CMs Meeting in Hyderabad: విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సుహృద్భావ వాతావరణంలో జరిగింది. సుమారు రెండు గంటలు జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రప్రభుత్వాల వినతులు, విజ్ఞప్తులు అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు. అంతకు ముందు ఇరు రాష్ట్రాల సీఎంల రాక కోసం ప్రజాభవన్ అధికారులతో సందడిగా మారింది. జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఇరువురు ముఖ్యమంత్రులు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
సమావేశం ప్రారంభం కాగానే ప్రజాభవన్‌లోకి చేరుకున్న చంద్రబాబును శాలువతో సత్కరించిన రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు రాసిన 'నాగొడవ' పుస్తకాన్ని బహుకరించారు. అటు తరువాత చంద్రబాబు ఏపీ ప్రభుత్వం తరుపున వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ఉన్న జ్ఞాపికను సీఎం రేవత్, డిప్యూటీ సీఎం భట్టి లకు అందజేశారు. అనంతరం వారిరువురిని శాలువతో సత్కరించారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల మీటింగ్‌కు వేదికైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.
హాజరైన మంత్రులు, అధికారులు: ఏపీ నుంచి సీఎస్‌లు నీరబ్‌కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు పలువురు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం శాంతికుమారి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరిగితే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి.
CM Chandrababu Letter to Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలపై ఆయన లేఖలో పేర్కొన్నారు. విభజన సమస్యలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డికి ఆయన సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు దాటినా విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై చర్చలు జరిగినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. చంద్రబాబు లేఖపై వెనువెంటనే స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై రెండు రాష్ట్రాల్లోని ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తోన్నారు.
అమరావతి ORRప్రాజెక్ట్ - CRDAగేమ్ ఛేంజర్, మీ ఊరు నుంచి వెళ్తుందా? - Amaravati Outer Ring Road
జగన్ సర్కార్ ఎంఐజీ ప్లాట్లతో పాట్లు- కూటమి రాకతో లబ్ధిదారుల్లో సంతోషం - MIG Layout No Facilities