Another Case has been Registered Against Rowdy Sheeter Borugadda Anil : రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు గట్టు తిలక్ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఆయనను పీటీవారెంట్‌పై కర్నూలుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో బోరుగడ్డ అనిల్ అరాచకానికి హద్దే లేకుండా పోయింది. పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. 2021లో కర్లపూడి బాబుప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో ఇటీవల పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నల్లపాడు ఠాణాకు తరలించారు. ఇదేకాకుండా అరండల్‌పేట, పట్టాభిపురం, కొత్తపేట, పాత గుంటూరు, తాడికొండ, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలోనూ అనిల్‌పై కేసులు ఉన్నాయి. అరండల్‌పేట పీఎస్‌లో ఉన్న రౌడీషీట్‌ని పట్టాభిపురం ఠాణాకు బదిలీ చేశారు.
రెస్టారెంట్‌కు బోరుగడ్డ అనిల్ - ఏడుగురు పోలీసులు సస్పెన్షన్
గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ జగన్‌కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు, ప్రతిపక్షనేతలపై సభ్యసమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాలు, టీవీ డిబేట్‌లలో ఇష్టానుసారం దూషణలు చేశాడు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. జగన్‌ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై టీవీ డిబెట్‌లలో దూషణలు చేస్తూ హల్‌చల్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, లోకేశ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
"జగన్ జోలికొస్తే బండికి కట్టి లాక్కుపోతా" - పరారీలో కొందరు, జైళ్ల భయంతో ఎందరో!
తాజాగా ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిపై దాడి కేసులో అనిల్‌కు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. అతన్ని మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో పోలీసులు రెస్టారెంట్‌కు తీసుకెళ్లారనే ఆరోపణలతో ఎస్పీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. తనపై ఉన్న కేసుల దృష్ట్యా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఎన్నికల ఫలితాల మరుసటి రోజు అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడు నెలలు పొరుగు రాష్ట్రాల్లోనే తలదాచుకున్నారు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని తెలుసుకుని గుంటూరులోని వేళంగిణి నగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదైంది.
' బండికి కట్టి లాక్కుపోతా .." ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెదిరింపులు.. ఆడియో వైరల్