ETV Bharat / state

అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు - సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు - లోకేశ్, అనిత ఏమన్నారంటే? - Andhra Pradesh assembly sessions - ANDHRA PRADESH ASSEMBLY SESSIONS

Andhra Pradesh Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు కొనసాగుతున్నాయి. పలువురు సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలు, గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా ప్రజల ఇబ్బందులను సభలో లేవనెత్తారు. దీనికి సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Andhra Pradesh assembly sessions
Andhra Pradesh assembly sessions (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 1:04 PM IST

Andhra Pradesh Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫలవంతంగా జరుగుతున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఎంతో ప్రశాంతంగా సమాధానాలు చెప్తున్నారు. తమ దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

Minister Lokesh on Pending Cases: గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యాశాఖలో పెద్ద ఎత్తున కోర్టు కేసులు పెండింగ్​లో ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. వీటన్నిటిని త్వరలోనే పరిష్కరించుకుని, నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. విద్యాశాఖలోని అధికారులు కొన్ని కోర్టు కేసుల కారణంగా అదే పనిలో నిమగ్నం కావాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేక అవసరాల విద్యార్ధులకు సంబంధించి అడిగిన ప్రశ్నలపై మంత్రి సమాధానం ఇచ్చారు.

ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు తుది ఆదేశాలు వచ్చాక తదుపరి కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక అవసరాల విద్యార్ధులు రాష్ట్రంలో 73 వేల 815 మంది ఉన్నారని, ప్రాథమిక పాఠశాలల్లో 54 వేల మంది చదువుతున్నారని లోకేశ్ వెల్లడించారు. 18 వేల మంది ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారని అన్నారు. 715 మంది స్పెషల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్నారన్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులే అయ్యిందని, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

'ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకున్నావా అన్న' - అసెంబ్లీ లాబీలో లోకేశ్ - Lokesh with MLA Venigandla Ramu

Lokesh on Colleges Facilities: విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడా వసతులు ఉన్నాయా అంటే మంత్రి ఉన్నాయని అంటున్నారని, అయితే పరిస్ధితులు వేరుగా ఉన్నాయని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని తాను దుర్మార్గపు ప్రభుత్వం అన్నందుకు తనను జైలులో పెట్టారని, ఇప్పడు బెయిల్​పై ఉన్నానని తెలిపారు. తన నియోజకవర్గంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ, ఎమ్మార్వో ఆఫీసు, రైతు బజార్, ఆర్ అండ్ బి క్వార్టర్​లను తాకట్టు పెట్టేవారని అన్నారు.

విశాఖలోని పాలిటెక్నిక్ కాలేజీలో టాయిలెట్స్ షార్టేజ్ ఉందని, త్వరలోనే ఈ షార్టేజ్ లేకుండా చూస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్ధలు భ్రష్టు పట్టాయని, వాటిని క్రమంగా సెట్ చేసుకుంటూ వస్తున్నానని అన్నారు. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఒక నెల రోజులు అధికారులకు టైం ఇచ్చామని, ఈలోగా దారి తప్పిన వ్యవస్ధను గాడిలో పెట్టాలని చెప్పినట్లు లోకేశ్ తెలిపారు.

మద్యం దోపిడీతో రూ.30 వేల కోట్లు దోపిడీ - అలాంటివాళ్లను వదిలేస్తే ఎలా?: పవన్ కల్యాణ్ - Pawan on Liquor Irregularities

Home Minister Anitha on Jagan Dharna at Delhi: శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో దాడుల అంశంపై హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల్ని చంపి దిల్లీ వెళ్లి ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోందని ఆమె అన్నారు. రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగితే అందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని అన్నారు. మీడియా 36 మంది పేర్లను ఇవ్వమంటే సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న జగన్, దిల్లీలో ధర్నా చేస్తున్నారని మంత్రి విమర్శించారు. 36 మంది వివరాలు ఇస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని తెలిపారు.

దిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా కుట్రపూరితంగా జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. 2019-24లో దాడులు చేసి, వాటిని భావప్రకటనా స్వేచ్ఛ అనేలా ప్రకటనలు చేయించారని, అలాంటి వ్యక్తులు శాంతి భద్రతలు గురించి మాట్లాడటం ఆశ్చర్యమనిపిస్తోందన్నారు. లోకేశ్ పాదయాత్ర చేస్తే కనీసం స్టూల్ ఎక్కి మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా షరతులు విధించారని గుర్తు చేశారు. ఐదేళ్లు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఈ అంశాలపై చర్చకు రావాలని మంత్రి అనిత సవాల్ చేశారు.

"పాలకుడు ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశాం- మద్యం సొమ్మంతా వైఎస్సార్సీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది" - excise department white paper

Discussion on Blade Batch and Ganja in Assembly: రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. గంజాయి మత్తులో అనేక దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. రౌడీయిజం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్​లను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని హోమ్ మంత్రి అనిత చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సీసీటీవీ కెమెరాలు కూడా పని చేయలేదని ఆమె ఆరోపించారు. నేరస్థులను పట్టుకుంటే వారి పూర్వ చరిత్ర చూసుకునే సిస్టమ్ కూడా లేకుండా చేశారని విమర్శించారు. చివరకు గుడి, బడికి కూడా భద్రత లేదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియంత్రణ లేక స్కూల్స్​లో కూడా గంజాయి వచ్చిందని ఆరోపించారు. గంజాయి నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇటీవల భేటీ అయిందని తెలిపారు. నియంత్రణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు.

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు - అసెంబ్లీ ఆమోదం - AP Assembly Sessions 2024

Minister Narayana on TDR Bonds Issue: టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నామని పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఒక్క తణుకులోనే 691 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు తేలిందని, దీనిపై ఏసీబీ నుంచి నివేదిక తెప్పించుకుంటున్నామని మంత్రి శాసనసభలో తెలిపారు. తిరుపతి, తణుకు, గుంటూరు, విశాఖలకు చెందిన టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

ప్రస్తుతం బాండ్ల జారీని నిలుపుదల చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. ఏసీబీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. తణుకులో 4500 చదరపు గజం విలువ ఉంటే 22 వేల విలువ ఉన్నట్లు చూపారని మంత్రి అన్నారు. దీనిపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. అయితే తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.

మాట ఇచ్చాం-రద్దు చేశాం - ల్యాండ్​ టైటిలింగ్​ చట్టం ఉద్దేశం అదే: చంద్రబాబు - Land Titling Act Repeal Bill

Minister Kinjarapu Atchannaidu on Cattle Feed: పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు "ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు" పథకం అమలు చేశారు. కానీ వైఎస్సార్సీపీ హయాంలో పథకం అమలు చేయకపోగా పాల సేకరణలో నిబంధనలు విధించి ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.

పర్యావరణ లక్ష్య సాధనకు ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం: మంత్రి పవన్ కల్యాణ్ - Pawan Kalyan on Visakha Pollution

Minister Dola on Welfare Schemes: గత ప్రభుత్వ హయాంలో చాలా సంక్షేమ పథకాలను రద్దు చేశారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి (Dola Bala Veeranjaneya Swamy) స్పష్టం చేశారు. ప్రత్యేకించి దళితులకు ప్రయోజనం కల్పించే పథకాలేవీ వారికి జగన్ ప్రభుత్వం అందించలేకపోయిందని అన్నారు. విదేశీ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, భూమి కేటాయింపులను కూడా చేయలేదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ ల్యాగ్ పోస్టులనూ బదిలీ చేయలేదని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోను నిందితులపై చర్యలు లేకుండా చేసిందని అన్నారు. దళితులకు మేనమామగా చెప్పుకున్న జగన్ కంసమామగా మారి హింసించారని మంత్రి ఆక్షేపించారు.

వారిని చేర్చుకోవాలా? వద్దా? - అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్​చాట్​ - BJP MLAs Chit chat in Assembly

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.