ETV Bharat / state

బంగారు పూతతో ఔరా అనిపించే బహుమతులు - అమూల్యం స్టోర్​లో అద్భుతమైన గిఫ్ట్స్​ - AMULYAM SPECIAL GIFT STORE IN HYD

Special Gifts For Special Events By Amulyam Hyderabad : వివాహ, ఇతర వేడుకలకు ఇచ్చే బహుమతుల్లో ఎవరికి వారే ప్రత్యేకతను చాటుకుంటారు. కొందరు బంగారు, వెండి ఆభరణాలు ఇస్తే మరికొందరు అలంకరణ వస్తువులు ఇస్తుంటారు. మరికొందరు వంటగదిలో ఉపయోగించే వస్తువులు బహుమతిగా ఇస్తుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ జంట బహుమతులు మదిలో నిలిచిపోయేలా విక్రయిస్తున్నారు. కేవలం బహుమతి మాత్రమే కాకుండా అందులో చరిత్రలో దాగిపోయిన విషయాలు తెలిసేలా మేలిమి బంగారు పూతతో బహుమతులు రూపొందించి తయారు చేయిస్తున్నారు.

Karimnagar Filigree Gifts
Special Story On Gold Plated Gifts (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 11:27 AM IST

భిన్నమైన బహుమతుల తయారీ - ప్రత్యేకత చాటుకుంటున్న దంపతులు (ETV Bharat)

Amulyam Arts And Gifts In Hyderabad : మార్కెట్‌లో ఎక్కువగా వినియోగంలో ఉండే వ్యాపారం చేయాలుకున్నారు త్రిషాలా, సుశాంత్ దంపతులు. ప్రతి ఇంట్లో ఉపయోగించే పచ్చళ్లను తయారు చేసి విక్రయించే వ్యాపారం ఎంచుకున్నారు. గదిలో వివిధ రకాల పచ్చళ్లు చేయించి వాటిని సీసాల్లో నింపి విక్రయించడం మొదలు పెట్టారు. వ్యాపారం మొదలు పెట్టిన నెలల్లోనే కరోనా మహమ్మారి కమ్మేసింది. వ్యాపారం దివాలా తీసింది. కనీసం మార్కెటింగ్ కూడా చేసుకోక ముందే పచ్చళ్ల వ్యాపారం దెబ్బతినడంతో త్రిషాలా, సుశాంత్ దంపతుల ఆలోచన మరో వైపు మళ్లింది.

Amulyam Special Gift Store in Hyderabad : ప్రతి వేడుకకు బహుమతులు ఇవ్వడం పరిపాటి. ఈ బహుమతుల పరిశ్రమ దినదినాభివృద్ది చెందుతోంది. ఈ రంగంలో అడుగు పెట్టారు ఈ దంపతులు. అయితే మార్కెట్‌లో అన్ని చోట్లా దొరికే బహుమతుల్లా కాకుండా మనసుకు హత్తుకుపోయే విధంగా పలు రకాల వస్తువులు విక్రయించాలనుకున్నారు. దీనికోసం పలువురు డిజైనర్లు, కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఖరీదైన బహమతులైనా సరే వాటిని ఒక్కసారి ఇస్తే జీవితాంతం గుర్తుంచుకోవాలనే కాన్సెప్ట్‌తో భిన్నమైన బహుమతులు, వస్తువులు అందుబాటులో ఉంచారు. వస్తువులకు తగిన విధంగానే వాటికి "అమూల్యం" అనే పేరుతో స్టోర్‌ పెట్టి విక్రయిస్తున్నారు. పర్యావరణానికి హానీ కలగకుండా రూపొందించిన వస్తువుల మాత్రమే అమూల్యం స్టోర్‌లో లభ్యమవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వెడ్డింగ్ - గెస్టులకు గిఫ్ట్​గా కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులు - AMBANI ORDERS KARIMNAGAR FILIGREE

డైనింగ్ టేబుల్‌పై ఉపయోగించే వస్తువులు ఎక్కువ శాతం పింగాణితో తయారు చేస్తారు. కానీ అమూల్యంలో లభించే టేబుల్ వేర్ మాత్రం నాణ్యమైన ముడి సరుకును ఉపయోగించి దానిపైన అరుదైన కళతో రూపొందిస్తున్నారు. అంతరించిపోతున్న కళలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్లేట్లు, చెంచాలు, టీ కప్పులు, ట్రేలు తయారు చేస్తున్నారు. ముడి సరుకు నుంచి ప్రతి వస్తువు కూడా దేశంలో తయారు చేసినవేనని సుశాంత్ చెబుతున్నారు.

Karimnagar Filigree Gifts : పిచ్‌వై, జోధ్‌పూర్, ఉదయపూర్ కట్లరీ, ప్రసిద్ధ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు ఇక్కడ లభిస్తున్నాయి. కరీంనగర్‌ సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలను అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో ఉపయోగించారు. అంతటి కళాత్మకత ఉన్న ఫిలిగ్రి బహుమతులను సైతం అమూల్యం స్టోర్‌లో విక్రయిస్తున్నామని తెలిపారు. జోధ్‌పూర్‌ను టేబుల్‌వేర్ కలెక్షనలలో నిర్మాణ శైలి ప్రతిభింబించే విధంగా కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, హవేలీలు ఇళ్ళు నీలిరంగు షేడ్స్‌లో పాత్రలపై చిత్రీకరించారు. ఈ పాత్రలన్నింటికి 24 క్యారెట్ల బంగారం పూత పూశారు.

పసిడి పూతతో ఉన్న డిన్నర్ సెట్ రూ. 50వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో ఏటా వేలకొద్దీ వివాహాలు, ఇతర వేడకలు జరుగుతుంటాయి. ఇందులో అతి ఖరీదైన వేడుకలు సైతం ఎక్కువగానే నిర్వహిస్తుంటారు. కొంతమంది వేడుకల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అలాంటి వేడుకల్లో బహుమతులు సైతం అతి ఖరీదైనవిగానే ఉంటున్నాయని తెలిపారు. ఈ వ్యాపారం ఏటా 30శాతం వృద్ధి చెందుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.

అదరహో అనిపించే సిల్వర్‌ ఫిలిగ్రీ కళ.. తెచ్చేను అవార్డుల కళ

ట్రంప్​నకు కరీంనగర్​ ఫిలిగ్రీ బహుమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.