American Police Arrest Indian Doctor : పవిత్రమైన వృత్తిలో ఉన్న అతను నీచమైన పనికి పూనుకున్నాడు. తన దగ్గరకు వైద్యానికి వచ్చిన మహిళలు, చిన్నారులను స్పృహ లేని సమయం చూసి అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేసేవాడు. గత కొన్నేళ్లుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రుల్లో రహస్య కెమెరాలతో వీడియోలను చిత్రీకరించాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెల్తే.. భారత్‌కు చెందిన ఒయిమెయిర్ ఎజాజ్ 2011లో వర్క్ వీసాపై అమెరికాకు వెళ్లాడు. తొలుత కొన్నేళ్ల పాటు అలబామాలో నివాసమున్న అతడు 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా అతడు లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు. తాను పనిచేసే చోట ఆసుపత్రి గదులు, బాత్రూమ్‌లు, చేజింగ్ ఏరియా వంటి ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు.
మహిళలు స్పృహలో లేనప్పుడు వారిపై అభ్యంతరకంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను చిత్రీకరించేవాడు. ఆసుపత్రుల్లో రోగులను కూడా లైంగికంగా వేధించేవాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అతడి భార్యకు ఈ విషయం తెలియడంతో ఆ వీడియోలను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్టు 8న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం అతడి ఇంటిని సోదా చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
అతడి నివాసంలో ఓ కంప్యూటర్, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందులో వేలాదిగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక సింగిల్ హార్డ్ డ్రైవ్‌లో 13వేల వీడియోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్లౌడ్ స్టోరేజ్‌లోనూ ఈ దృశ్యాలను అప్‌లోడ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడిపై నేరాభియోగాలు మోపి జైలుకు పంపించారు. అతడి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉందని, దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కొన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.
సముద్రంలో దూకబోయిన మహిళ! 'సూపర్ హీరో'లా కాపాడిన క్యాబ్ డ్రైవర్ - Woman Suicide Attempt Foiled
మాజీ క్రికెటర్ బలవన్మరణం!- షాకింగ్ విషయాలు బయటపెట్టిన అతడి భార్య!! - Graham Thorpe Comitted Suicide