Amaravati Farmers Protest : అమరావతిపై విషం కక్కే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయాన్ని ఎలా తాకట్టు పెడతారని రాజధాని రైతులు ప్రశ్నించారు. అమరావతికి మద్దతుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మాండమస్ తీర్పు ఇచ్చి రెండు సంవత్సారాలు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజధానికి అనుకూలంగా తీర్పు వచ్చి రెండేళ్లు దాటినా అమరావతి నిర్మాణాలలో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని రైతులు, మహిళలు పళ్లాలు, గరెటలు మోగించారు.
AP Secretariat Mortgage : గుంటూరు జిల్లాలోని తుళ్లూరు దీక్షా శిబిరంలో మహిళలు పళ్లాలు, గరిటెలు మోగించగా పురుషులు బూరలు ఊదారు. రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ మొద్దు నిద్ర పోతున్నారని తమ నిరసనతోనైనా ఆయన మెల్కొంటారని రైతులు చెప్పారు. అమరావతిపై నిత్యం విషం కక్కే ముఖ్యమంత్రి జగన్ ఇక్కడి ఆస్తులను ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నించారు. ఆనాడు సచివాలయం నిర్మిస్తుంటే తీవ్ర విమర్శలు చేసిన జగన్ నేడు వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడాన్ని రైతులు తప్పుపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన ప్లాట్లను తాకట్టుపెట్టుకోవడానికి బ్యాంకులు లక్ష కారణాలు చెబుతున్నాయని, ఇప్పుడు అవే బ్యాంకులు ప్రభుత్వానికి ఎలా రుణాలు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఒక న్యాయం రైతులకు ఒక న్యాయమా అంటూ బ్యాంకుల తీరుపై విమర్శలకు గుప్పించారు.
రాజధాని పేదలపై జగన్ కపట ప్రేమ - ఎన్నికల కోసమే పెన్షన్ పెంపు అంటున్న రైతులు
Chandrababu Tweet on AP Govt Debts : ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని రూ. 370 కోట్లకు తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ సీఎంకి తెలుసా అని నిలదీశారు.
జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని నాశనం చేశాడని విమర్శించారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని విజ్ఙప్తి చేశారు.
ఆంక్షలు, నిర్బంధాలు ఏవీ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి : అమరావతి రైతులు
Nara Lokesh Tweet on CM Jagan : గత ఐదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్‌ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని తామంటే ఒంటికాలిపై లేచిన వైసీపీ మేధావులు దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ : ఏపీ సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అనిపిస్తోందన్నారు. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టుపెట్టలేదని గుర్తుచేశారు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదని మండిపడ్డారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్