Amaravati Drone Summit 2024 : డ్రోన్స్ సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి దిక్సూచిగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్స్ వినియోగానికేకాదు, తయారీకీ ఏపీని కేంద్రంగా నిలపాలనే వ్యూహాత్మక ప్రణాళికను ఈ నెల 22, 23న మంగళగిరిలో జరిగే రెండ్రోజుల జాతీయ సదస్సులో చాటనుంది.
డ్రోన్స్ సాంకేతిక సౌలభ్యాన్ని సమర్థంగా వినియోగించుకుని పలు దేశాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో 2030 కల్లా డ్రోన్స్ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలిపేలా వ్యూహరచన చేస్తోంది. రక్షణ, సాంకేతిక, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్తు, రహదారులు, విపత్తుల నిర్వహణ వంటి 14 రంగాల్లో డ్రోన్స్ వినియోగానికి అపార అవకాశాలున్నాయి. ఈ అవకాశాన్ని అందరికంటే ముందే అందిపుచ్చుకుని, ఏపీని డ్రోన్స్ క్యాపిటల్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా ఏపీలో డ్రోన్ సమ్మిట్- బెస్ట్ డ్రోన్లకు నజరానాలు - Amaravati Drone Summit 2024
ఇప్పటికే డ్రోన్స్ కార్పొరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాలనలో, విపత్తుల నిర్వహణలో, ప్రజల దైనందిన జీవితంలో డ్రోన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని సత్ఫలితాలు సాధించడంపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 22, 23తేదీల్లో మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను నిర్వహిస్తోంది. ముంబయి, తిరుపతి, హైదరాబాద్ ఐఐటీల నుంచి నిపుణలు, డ్రోన్స్ రంగంలో అపార అనుభవమున్న దేశ, విదేశీ సాంకేతిక ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించనుంది.
ఇటీవల విజయవాడ వరదల్లో డ్రోన్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకుని సీఎం చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రశంసలు ఆందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని అంచనా వేస్తోంది. ఈ దిశగా ఎదరయ్యే సవాళ్లు- పరిష్కార మార్గాలపై సదస్సులో మేథావులు, సాంకేతిక నిపుణలతో చర్చలు జరపనుంది.
డ్రోన్ల ద్వారా మందుల సరఫరా - పైలట్ ప్రాజెక్టు విజయవంతం - Medicines Delivering with Drones
అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ కృష్ణాతీరంలో భారీ ప్రదర్శనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో అత్యధికంగా 2 వేల డ్రోన్స్‌తో షో నిర్వహించగా ఏపీ ప్రభుత్వం 5 వేల డ్రోన్స్‌తో మెగాషో నిర్వహించి రికార్డు సృష్టించాలనుకుంటోంది. ఔత్సాహికులకు హ్యాకథాన్ పోటీలు నిర్వహించి బహుమతులూ అందజేయనుంది. ఇప్పటికే 80 మంది డ్రోన్స్ ఔత్సాహికులు ఈ పోటీలకు నమోదు చేసుకున్నారు.
డ్రోన్‌తో చిన్నిగణపయ్య నిమజ్జనం - నెట్టింట వీడియో వైరల్ - Ganesh IMMERSION With Help of Drone