ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పూర్తైన మద్యం దుకాణాల కేటాయింపు - లిక్కర్‌ 'లక్​'ని కొట్టేసిన ఇతర రాష్ట్రాల వ్యాపారులు

కృష్ణా జిల్లాలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించిన అధికారులు

AP Liquor Lottery 2024
AP Liquor Lottery 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 10:47 PM IST

Updated : Oct 14, 2024, 10:54 PM IST

AP Liquor Lottery 2024 : కృష్ణా జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. మద్యం దుకాణాలకు ప్రశాంత వాతావరణంలో అధికారులు లాటరీ నిర్వహించారు. 123 మద్యం దుకాణాలకుగాను 2942 మంది దరఖాస్తు చేస్తుకున్నారు. జిల్లాలో మద్యం టెండర్లలో కర్నాటక, యూపీకి చెందిన వ్యక్తులు సైతం లాటరీల ద్వారా మద్యం షాపులను దక్కించుకున్నారు. దరఖాస్తుదారుల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. మద్యం షాపుల లాటరీలతో రూ.58.84 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఆయా దుకాణాల కేటాయింపునకుగానూ ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభించి 11 గంటల కల్లా పూర్తి చేయాలని అధికారులు భావించారు. ఇందుకోసం మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో లాటరీ 8 సర్కిళ్ల వారీగా 8 కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. తొలుత మచిలీపట్నం కౌంటర్‌లో ఉదయం 8 గంటలకే జేసీ గీతాంజలిశర్మ, పలువురు ఎక్సైజ్‌ అధికారులతో కలిసి లాటరీని పరిశీలించారు. బందరు సర్కిల్‌ పరిధిలోని 16 దుకాణాలకు అదే కేంద్రం వద్ద లాటరీ పూర్తి చేశారు. తర్వాత వివిధ కౌంటర్‌లకు వెళ్లి లాటరీ తీయడం వల్ల సమయం పడుతుందని భావించి తర్వాత వేరే బ్లాక్‌లో ఒకే చోట మిగిలిన 7 సర్కిళ్ల పరిధిలోని దుకాణాలకు లాటరీ నిర్వహించారు.

Liquor Shops Allotment Krishna Dist : మధ్యాహ్నం 1:30 గంటల కల్లా మొత్తం జిల్లాలోని 123 దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి చేశారు. ఎక్సైజ్‌ అధికారులతోపాటు పరిశీలకులుగా కలెక్టర్‌ నియమించిన ప్రత్యేక అధికారులు ఈ ఎంపిక పక్రియను పర్యవేక్షించారు. సర్కిళ్ల వారీగా దరఖాస్తుదారులకు నంబర్లు కేటాయించి ఎక్కడ ఎంతమంది అర్జీదారులు ఉంటే అన్ని టోకెన్‌లు వేసి జేసీ గీతాంజలి శర్మ లాటరీ తీశారు. దుకాణం దక్కించుకున్న వ్యక్తి సకాలంలో నిర్ధేశించిన రుసుము చెల్లించకుంటే వేరేవారికి ఆ దుకాణం కేటాయించేలా ఒక్కొ దుకాణానికి ఇద్దరు చొప్పున రిజర్వ్‌డ్‌గా లాటరీ తీశారు.

సిండికేట్‌లే హవా : మచిలీపట్నంతో పాటు పెడన, గుడివాడ, తాడిగడప, ఉయ్యూరు, గన్నవవరం పట్టణాల్లో ఎక్కువగా సిండికేట్‌లే హవా చాటుకున్నారు. ఎక్కువ దుకాణాలను వారు కైవసం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొందరు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఆదేశాలకు అనుగుణంగా సిండికేట్‌లుగా ఏర్పడి దరఖాస్తులు చేసుకుంటే, ఇప్పటికే లిక్కర్‌ వ్యాపారంలో గుర్తింపు పొందినవారు కూడా సిండికేట్‌లుగా ఏర్పడ్డారు. 10 నుంచి 20 మంది వరకు కూడా బృందాలుగా ఏర్పడినట్లు లాటరీకి హజరైన వారే చర్చించుకున్నారు. మచిలీపట్నంకు చెందిన లిక్కర్‌ వ్యాపారులు బందరుతో పాటు పెడనలో కూడా దుకాణాలు దక్కించుకున్నారని పలువురు దరఖాస్తుదారులు చెప్పుకున్నారు.

మహిళల పేరిట దరఖాస్తు చేస్తే కలిసి వస్తుందన్న భావనతో కొందరు తమ కుటుంబసభ్యుల్లోని మహిళలతో అర్జీ చేయించారు. అన్ని స్టేషన్‌ల పరిధిలోనూ దరఖాస్తుదారులు ఉన్నా గుడ్లవల్లేరుకు చెందిన ఈడే సుధారాణి, బాపులపాడుకు చెందిన కె.హారిక, తాడిగడపకు చెందిన కె.అమూల్య, పెనమలూరు నుంచి డి.వెంకటనాగలక్ష్మి, కృత్తివెన్నుకు చెందిన ఉప్పాల రాజకుమారిలు దుకాణాలను దక్కించుకున్నారు. ఇలా మహిళలు మద్యం దుకాణాల లాటరీకి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మద్యం దుకాణాల లాటరీకి ఆన్‌లైన్‌లో కూడా అర్జీలు స్వీకరించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పలువురు దుకాణాలు కూడా దక్కించుకున్నారు.

Allotment Of Liquor Shops in AP : మచిలీపట్నంలో నిర్వహించిన మద్యం లాటరీలో కర్నాటక, యూపీ రాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులు షాపులు దక్కించుకున్నారు. మచిలీపట్నం 1వ నంబర్ షాప్​ని కర్ణాటకకు చెందిన మహేష్ ఎ బాతే, 2వ నంబర్ షాప్​ని యుపీకి చెందిన లోకేష్ చంద్ వ్యక్తులు లాటరీలో కైవసం చేసుకున్నారు. దుకాణాలు పొందినవారు రూ.55 లక్షల స్లాబ్‌కు రూ.9.16 లక్షలు, రూ.65 లక్షల స్లాబ్​కు రూ.10.80 లక్షలు తొలుత చెల్లించాల్సి ఉంది. దీనికి కోసం మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో కళాశాల ప్రాంగణంలోనే ప్రత్యేక బ్యాంకు కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. ఏడాదికి ఆరు వాయిదాల్లో దుకాణానికి రుసుము చెల్లించే అవకాశం ఉంది. అయితే కొందరు స్థానికేతరులు దక్కించుకున్న దుకాణాలను వేరేవారికి కేటాయించేందుకు అక్కడే బేరసారాలు నిర్వహించారు.

లిక్కర్ బిజినెస్​లోకి సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు - మద్యం దుకాణాల దరఖాస్తుల్లో 'వారే' అధికం! - AP NEW LIQUOR POLICY 2024

"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?

Last Updated : Oct 14, 2024, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.