ETV Bharat / state

జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి నేతలు విజయం - మరోసారి పరాజయమైన వైఎస్సార్సీపీ - NDA Win GVMC Elections - NDA WIN GVMC ELECTIONS

Alliance Win in GVMC Standing Committee Elections: మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పది స్థానాలు గెలుచుకొని విజయకేతనం ఎగురవేసింది. వైఎస్సార్సీపీ నేతలు మళ్లీ పరాజయం పాలయ్యారు. జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో నేతలు సంబరాలు జరుపుకున్నారు.

Alliance Win in GVMC Elections
Alliance Win in GVMC Elections (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 10:54 PM IST

జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి నేతలు విజయం - మరోసారి పరాజయమైన వైఎస్సార్సీపీ (ETV Bharat)

Alliance Win in GVMC Standing Committee Elections: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు హవా కొనసాగించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 10 స్థానాలను గెలుచుకొని కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏడుగురు అభ్యర్థులకు 60కి మించి ఓట్లు పడ్డాయి. అత్యధికంగా విల్లూరి భాస్కరరావు 66 ఓట్లు కైవశం చేసుకున్నారు. జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో నేతలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు. కూటమి గెలుపుపై ఎమ్మెల్యేలు గండి బాబ్జి, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ - YCP Corporators To Joined Janasena

వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా, మిగిలిన వాళ్లతో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు జరగగా మూడు సార్లు వైఎస్సార్సీపీ సభ్యులే గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న కూటమి స్థాయీ సంఘం ఎన్నికల్లో మూడు సంవత్సరాల తర్వాత అన్ని స్థానాలను కైవసం చేసుకుంది.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయీ సంఘం ఎన్నికలు బుధవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరిగాయి. పది స్థానాలకు వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు వేశారు. కూటమి తరఫున నిలబడిన టీడీపీ అభ్యర్థులు పది మంది అన్ని స్థానాలను వెఎస్సార్సీపీ ఓడించి గెలుచుకున్నారు.

ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో కూటమి అభ్యర్థి? - Alliance Candidate in MLC Elections

ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. జీవీఎంసీ కార్యాలయం బయట సంబరాలు చేసుకొని మిఠాయిలు తినిపించుకున్నారు. వైఎస్సార్సీపీ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, కేకే రాజు స్థాయీ సంఘం ఎన్నికలను పరిశీలించగా కూటమి తరుపున విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి, సీతంరాజు సుధాకర్, శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ , వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు సమన్వయం చేశారు. ఈ గెలుపుతో మరింత ఉత్సాహంగా పరిపాలన చేస్తామని కూటమి నేతలు అన్నారు. అనంతరం మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

ఆగస్టు 30న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స - Visakha MLC Election

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.