ETV Bharat / state

రాష్ట్రంలో జోరందుకున్న టీడీపీ ప్రచారం- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచార పర్వం - Alliance Candidates campaign - ALLIANCE CANDIDATES CAMPAIGN

Alliance Candidates Election Campaign:రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడటంతో కూటమి నేతలు జోరు పెంచారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ చేసిన అరాచకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. పలు గ్రామాల్లో నేతలకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. వైసీపీ నియంతృత్వానికి ఓటుతో బుద్ధి చెబుదామని నేతలు అంటున్నారు.

Alliance_Candidates_Election_Campaign
Alliance_Candidates_Election_Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 1:10 PM IST

Alliance Candidates Election Campaign: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. కూటమి అభ్యర్థులతో కలసి సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు జిల్లాల్లో వైఎస్సార్సీపీ నేతలు అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు. రాష్ట్ర పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు స్పష్టం చేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచారం - అడుగడుగునా ప్రజాదరణ - Alliance leaders election campaign

Kurnool, Nandhyal: యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పిలుపిచ్చారు. కర్నూలులోని 16వ వార్డులో భరత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పందిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలువురు నేతల ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. నంద్యాల జిల్లా డోన్ మండలం గుండాల, తిరుణాంపల్లి గ్రామాల్లో డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు తెలియజేసారు.
Anantapur, Puttaparthi: అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల పోతుల కుంట, మరకుంటపల్లి గ్రామాలలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు. అనంతపురంలో వైఎస్సార్సీపీ నుంచి సుమారు 200 మంది టీడీపీలో చేరారు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని పలు గ్రామాల్లో హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ అసెంబ్లీ అభ్యర్థి సవిత ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేసి ఓట్లును అభ్యర్థించారు.

రాష్ట్రంలో జోరుగా కూటమి నేతల ప్రచారం - హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు - ALLIANCE Leaders ELECTION CAMPAIGN

Nellore, Prakasam: నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో టీడీపీ అభ్యర్థులు ప్రజాగళం కార్యక్రమం చేపట్టారు. ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పలువురు వైఎస్సార్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్సార్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలంలోని కీలక నాయకులతోపాటు కాపు సామాజిక వర్గానికి చెందిన 400 కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాయి. ఒంగోల్లో తెలుగుదేశం నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరి చేత టీడీపీకి ఓటు వేయించాలని దామచర్ల జనార్ధన్‌ కోరారు. దర్శి నియోజకవర్గంలోని పెదరావిపాడులో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

Bapatla, NTR: బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొణిదెన గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా లక్ష్మీపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం ప్రారంభించి గాడి తప్పిన వ్యవస్థలన్నిటిని సరి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకుంటారని స్పష్టం చేశాడు.

' వైఎస్సార్సీపీ తరిమికొట్టేందుకు అంతా కలిసి నడవాలి ' జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - TDP leaders Election campaign
తెలుగుదేశం సీనియర్ నేత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జగన్ పాలన అంతం చేసేందుకు జనం సిద్ధమయ్యారని బుచ్చయ్య అన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లాలో కూటమి అభ్యర్థి కొండబాబు ఆధ్వర్యంలో జయహా బీసీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందాలన్నా, బీసీలకు న్యాయం జరగాలన్నా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కొండబాబు కోరారు. కోనసీమ జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయం సాధించే విధంగా కూటమి నాయకులు మండల స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్​తో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్ టీడీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి అనుభవం కలిగిన చంద్రబాబు పాలన ఇప్పుడు రాష్ట్రానికి అవసరమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణా సూపర్‌సిక్స్‌ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్‌ కుటుంబ సభ్యులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం అభ్యర్థి కొండ్రు మురళి మోహన్‌ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.