ETV Bharat / state

నెల్లూరు కార్పొరేషన్​లో కమిషనర్ సంతకం ఫోర్జరీ- సూత్రధారి మేయర్​ భర్తనా! - Nellore Corporation Allegations - NELLORE CORPORATION ALLEGATIONS

Allegations of corruption in Nellore Corporation : కార్పొరేషన్​ పరిధిలో అవినీతి జరిగిందని నెల్లూరు నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. నగర కమిషనర్​ సంతకాన్ని ఫోర్జరీ చేసి కార్పొరేషన్​కు రూ. కోట్ల ఆదాయానికి గండి కొట్టారని ఆరోపిస్తున్నారు. ఈ అవినీతిలో మేయర్​ భర్త హస్తం ఉందనే అనుమానాలు వెల్లువెత్తున్నాయి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 12:10 PM IST

నెల్లూరు కార్పొరేషన్​లో కమిషనర్ సంతకం ఫోర్జరీ- సూత్రధారి మేయర్​ భర్తనా! (ETV Bharat)

Allegations of Corruption in Nellore Corporation : నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తనఖా ఆస్తులు విడుదలకు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భారీ అవినీతికి పాల్పడిన ఘటనపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో కోట్ల రూపాయలు కార్పొరేషన్ అదాయానికి గండిపడినా కలెక్టర్, కమిషనర్ మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో మేయర్ భర్త హస్తం ఉందని ఆరోపణలు ఉన్నా విచారణ చేయడం లేదు.

నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై 275 కేసులు నమోదు - Investigating Quadge Illegal Mining

నెల్లూరులో కమిషన్‌ సంతకం ఫోర్జరీ చేయడం స్థానికంగా దుమారం రేపుతోంది. కార్పొరేషన్‌లో వందలాది బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో మేయర్ స్రవంతి భర్త జయవర్దన్ అవినీతికి పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి. 9 భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని టెక్కెమిట్ట రోడ్డులో నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనానికి ప్లాన్ అప్రూవల్ లో అక్రమాలు జరిగాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయడంపై దుమారం రేగింది. కార్పొరేషన్‌ పరిధిలో వెలుగులోకి రాని అక్రమాలు చాలా ఉన్నాయని కార్పొరేటర్లు అంటున్నారు.

ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం - మురుగు కూపంగా మారిపోయిన నెల్లూరు నగరం - Drainage System in Nellore District

"దాదాపు రూ. 20 కోట్లు కుంభకోణం జరిగింది. ఐఏఎస్​ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి భవనాల అదనపు ఫ్లోర్​లను నిర్మించుకున్నారు. ఐఏఎస్​ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, ప్రజాప్రతినిధులను తక్షణమే అరెస్ట్​ చేయాలి"_ మదన్​ మోహన్, నెల్లూరు నగర కార్పొరేటర్​

10 రోజులుగా పలు అక్రమాలపై ఆరోపణలు వస్తున్నా జిల్లా అధికారులు సమగ్ర విచారణలో జాప్యం చేస్తున్నారు. మొక్కుబడిగా నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరారు.

ఫోర్జరీ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్దన్ చెబుతున్నారు.నెల్లూరులో వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై మంత్రి నారాయణ దృష్టికి తీసుకుపోయేందుకు కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.

"కమిషన్​ సంతకాన్ని ఎవరైతే ఫోర్జరీ చేశామని మాపై ఆరోపణలు చేశారో దాన్ని పూర్తి స్థాయిలో కనుక్కొవాలని ఆశిస్తున్నాము. విచారణ చేయలని కూడా నేను కోరుకుంటున్నాను. అందుకు నేను పూర్తి సహకారాన్ని అందిస్తాను"_స్రవంతి, మేయర్

'అయినా ఆగడం లేదు' రెచ్చిపోతున్న ఇసుక మాఫియా- మర్రిపాడులో నాలుగు లారీలు సీజ్ - Sand Mafia In Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.