ETV Bharat / state

అథ్లెటిక్‌ కోచ్‌గా ఆదిలాబాద్ అడవి బిడ్డ - గిరిజన విద్యార్థులకు శిక్షణ - Adilabad A Young Athletic Coach

Adilabad Athletic Coach Vidya Sagar : అనుకోని విధంగా క్రీడా ప్రయాణంలో ఒడుదొడుకులు ఎదురైనా నిరుత్సాహ పడలేదు ఈ యువకుడు. గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. జాతీయస్థాయిలో పతకాలు రాబట్టేలా శిక్షణ ఇస్తున్నాడు. మారుమూల గ్రామాల్లోని పిల్లలు సైతం ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేయాలని సంకల్పించానని అందుకే కోచ్‌గా మారి తన వంతు కృషి చేస్తున్నానని చెబుతున్నాడు.

A Young Athletic Coach Adilabad
A Young Athletic Coach Adilabad
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 1:47 PM IST

Updated : Jan 31, 2024, 2:12 PM IST

అథ్లెటిక్‌ కోచ్‌గా ఆదిలాబాద్ అడవి బిడ్డ

Adilabad Athletic Coach Vidya Sagar : ఈ యువకుడి పేరు ముక్కెర విద్యాసాగర్‌. స్వగ్రామం ఆదిలాబాద్‌ జిల్లాలోని గుండాయపల్లె బావురావ్‌పేట. డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఆసిఫాబాద్‌లోని గిరిజన పాఠశాలలో క్రీడా కోచ్‌గా (A Young Athletic Coach) పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు లక్ష్మీ, శంకర్‌గౌడ్‌లతో కలసి వ్యవసాయ పనులు చేసేవాడు సాగర్‌. చదువుతో పాటు ఆటలపైనా ఆసక్తి పెంచుకున్నాడు. అలా 8 వ తరగతి నుంచే ఎక్కడ అథ్లెటిక్స్‌ పోటీలు జరిగినా ఉత్సాహంగా పాల్గొనేవాడు.

2008 నుంచి 2014 వరకూ అనేక పోటీల్లో అథ్లెటిక్‌గా సత్తా చాటాడు విద్యాసాగర్‌. ఎలాంటి తర్ఫీదు లేకపోయినా రాష్ట్రస్థాయిలో 10 స్వర్ణ, 8 రజత, 4 కాంస్య పతకాలు అందుకున్నాడు. తక్కువ సమయంలోనే సాయ్‌ శిక్షణకు అర్హత సాధించాడు. దిల్లీ, త్రివేండ్రం, కోల్‌కతా, బెంగళూర్‌, తదితర చోట్ల జరిగిన అనేక జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. దాదాపు 12 జాతీయస్థాయి పోటీల్లో అథ్లెటిక్‌గా ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.

చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

"నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం. పదోతరగతిలో రాష్ట్రస్థాయిలో మెడల్ సాధించాను. సాయ్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాను. డిగ్రీ వరంగల్‌లో పూర్తి చేశాను. 2008 నుంచి 2014 వరకూ అనేక పోటీల్లో పాల్గొన్నాను. 10 స్వర్ణ, 8 రజత, 4 కాంస్య పతకాలు సాధించాను. 2017లో ఎన్‌ఐఏఎస్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత ఉపాధి కోసం గిరిజన పాఠశాలలో కోచ్‌గా చేరాను. ఇక్కడి విద్యార్థులు పతకాలు సాధిస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతోంది." - విద్యాసాగర్, క్రీడా శిక్షకుడు

Adilabad Young Athletic Coach : విద్యాసాగర్ 2014లో కుటుంబ పరిస్థితుల వల్ల క్రీడలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. క్రీడాకోటాలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అథ్లెటిక్స్‌ శిక్షకుడి అర్హత కోసం కోల్‌కతాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌లో డిప్లోమా కోర్సు పూర్తిచేశాడు. ఆటలపై మక్కువతో గిరిజన పాఠశాలలో కోచ్‌గా పనిచేస్తున్నాడు. విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలు వెలికితీసి అథ్లెటిక్స్‌లో రాటుతేలేలా చేయడమే ధ్యేయమని అంటున్నాడు.

ఏజెన్సీ ఏరియా నుంచి యువ శాస్త్రవేత్త వరకు - పేద రైతు కుమారుడి విజయగాథ సాగిందిలా

ఇప్పటికే విద్యాసాగర్ కొందర్నీ రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాడు. అతని శిక్షణలో సాక్షి అనే 9వ తరగతి విద్యార్థిని జాతీయ జావెలిన్‌ పోటీల్లో రికార్డు ప్రదర్శన చేసింది. మైనీ అనే అమ్మాయి జావెలిన్‌లోనే రాష్ట్రస్థాయిలో పతకాలు సాధిస్తోంది. కనీస వసతులు లేకున్నా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరస్తున్నారని విద్యాసాగర్ చెబుతున్నాడు. వారికి ప్రభుత్వం సరైన పౌష్ఠికాహారం, సౌకర్యాలు అందించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగేలా సహకరించాలని కోరుతున్నాడు. జీవితంలో ఓడిపోయామని కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలని అంటున్నాడు. అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ పతకం సాధించాలనే కల నెరవేరకపోయినా తనవద్ద శిక్షణ పొందిన విద్యార్థులు పతకాలు సాధిస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతోందని విద్యాసాగర్ తెలియజేస్తున్నాడు.

డిగ్రీలు పూర్తి చేసి - సహజ సిద్దమైన వంట నూనె తయారీ వ్యాపారంలో రాణిస్తున్న ముగ్గురు మిత్రులు

20 సినిమాల్లో 50 పాటలు - ఈ యువ రచయిత సక్సెస్​ స్టోరీ తెర వెనక కష్టాలు తెలుసుకోవాల్సిందే

Last Updated : Jan 31, 2024, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.