ETV Bharat / state

'గొర్రెలు తీసుకున్నారు కానీ మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు సార్​' - గొర్రెల పంపిణీ స్కీమ్​పై ఏసీబీకి ఫిర్యాదు - ts sheep distribution Scheme

ACB Speed up Investigation on Sheep Distribution in Telangana : గొర్రెల పంపిణీ స్కీమ్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణ నేపథ్యంలో బాధితుల నుంచి అధికారులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Sheep Distribution in Telangana
ACB Speedup Investigation on Sheep Distribution in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 8:51 PM IST

Updated : Feb 18, 2024, 10:12 PM IST

గొర్రెలు తీసుకున్నారు కానీ మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు సార్​

ACB Speed up Investigation on Sheep Distribution in Telangana : గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగాయని బాధితులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​(Gachibowli Police Station)​​లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. దర్యార్తులో భాగంగా గొర్రెల పంపిణీ పథకం(Sheep Distribution Scheme) కోసం గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతుల వివరాలను అధికారులు సేకరించారని బాధితులు చెప్పారు.

130 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినందుకు గానూ వారికి రావాల్సిన నగదు రూ.2.10 కోట్లకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అధికారులకు ఇచ్చామని బాధితులు తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్​ యాదవ్​ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department) అధికారులు, కాంట్రాక్టర్ మోహినుద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్ద గొర్రెలను తీసుకున్నారని తెలియజేశారు. తమకు రావలసిన నగదు చెల్లించకుండా మోసం చేసిందే కాకుండా దుర్భాషలాడారని ఏసీబీ అధికారులకు వివరించారు. వారి వద్ద ఉన్న ఆధారాలు తీసుకొని విచారణ అనంతరం న్యాయం చేస్తామని ఏసీబీ అధికారులు భరోసా ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు.

మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.. రూ. 7లక్షలు స్వాధీనం

"ప్రకాశం జిల్లాకు వచ్చి గొర్రెలు కావాలి అన్నారు. మాకు రూ.2.10కోట్లు డబ్బులు ఇవ్వాలి. మాకు రావాల్సిన డబ్బులను వారి బినామీలకు ఇచ్చారు. ఇంకా ఈ విషయం ఎవరికి తెలియదు. వారందరికి తెలిసాక అందరూ దీనిపై ఫిర్యాదు చేయడానికి వస్తారు. మాకు మా డబ్బులు ఇప్పించండి." - బాధిత రైతులు

Sheep Distribution in Telangana : నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం

Telangana Sheep Scheme 2023 : 2017 ఏప్రిల్​లో గత​ ప్రభుత్వం గొర్రెల పెంపకం(Sheep Breeding) అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్‌గా అందజేశారు. ఒక యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలు కాగా అందులో 75 శాతం రాయితీ ఇచ్చారు. మిగిలిన 25 శాతం నగదును లబ్ధిదారుడే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండో విడత భాగంగా ఆంధ్రప్రదేశ్​కు చెందిన రైతుల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి కొంతవరకు నగదు ఇచ్చారు. మిగిలిన రైతులకు రూ.2కోట్లకు పైగా నగదు చెల్లించాల్సి ఉండగా డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని బాధితులు వాపోయారు.

ఈ గొర్రెల పంపిణీ పథకంలో పశుసంవర్ధక శాఖ అధికారులు కుమ్మక్కై, కాంట్రాక్టర్లు బినామీ పేర్ల మీద డబ్బులు కాజేశారని ఏసీబీ అధికారుల దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. గొర్రెల పంపిణీ పథకం స్కామ్​లో ఎవరి పాత్రలు ఉన్నాయో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. విచారణ అనంతరం బాధితులకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తామని అధికారులు భరోసా కల్పించారు.

అవును.. ఆ గొర్రె ధర 1.50 కోట్లే.!

Last Updated : Feb 18, 2024, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.