Formula E Car Race Case Update : రాష్ట్రంలో కొన్ని రోజులుగా సంచలనాత్మకంగా మారిన ఫార్ములా ఈ - రేసు కేసు దర్యాప్తులో అవినీతి నిరోధకశాఖ ఏసీబీ దూకుడు పెంచింది. సంబంధిత ధ్రువపత్రాల సేకరించే పనిలో పడింది. మరోవైపు ఫెమా, నిధుల మళ్లింపు కేసు నమోదుచేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోమవారం నుంచి విచారణ చేపట్టనుంది. ఫార్ములా ఈ- రేసు నిర్వహణ పేరుతో రూ.54 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించారని, దీంట్లో దానికి సంబంధించి నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఫెమా ఉల్లంఘన : విదేశీ సంస్థకు నిధులు చెల్లించనప్పటికీ రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకోకపోవడం ఫెమా ఉల్లంఘన అవుతుందని, దీంతో పాటు నిధుల మళ్లింపు జరిగినట్లు కూడా ఈడీ అనుమానిస్తుంది. దీంతో ఈడీ అధికారులు పీఎంఎల్ఏ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఏసీబీ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పది రోజుల వరకు అంటే ఈ నెల 30వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. మిగిలిన నిందితులైన అర్వింద్ కుమార్, బీఎల్రెడ్డిలను ఏసీబీ అరెస్ట్ చేయాలంటే ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దీనికి సంబంధించి ఏసీబీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ దర్యాప్తు యథావిధిగా కొనసాగిస్తుంది.
సోమవారం రంగంలోకి ఈడీ : 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన రేసుతోపాటు 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాలనుకున్న మరో రేసుకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈవోతో పురపాలక శాఖ నిర్వహించిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను కూడా సేకరిస్తుంది. అసలు ఈ రేసు నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా చేశారు. దీన్ని ఎవరు ఆమోదించారనే కోణంలో సమాచారాన్ని సేకరిస్తుంది. ఖర్చులు ఎలా అంచనా వేశారు? చెల్లింపులు ఎలా జరిపారు? వంటి వాటికి సంబంధించిన ప్రతి దస్త్రం తెప్పించుకుంటుంది.
ఈ మొత్తం పక్రియలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అవసరమైతే వారందరి వాంగ్మూలను నమోదు చేయనుంది. ఈ వ్యవహారంలో నిబంధనలు ఎలా ఉన్నాయి. ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయనే వివరాలను జల్లడ పట్టనుంది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని మాత్రమే హైకోర్టు తెలిపిందని దీంతో ఆయనతో పాటు మిగతా ఇద్దరు నిందితులను ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారించే అవకాశం ఉంది.
నగదు లావాదేవీల వివరాలు సేకరించనున్న ఈడీ : మరోపక్క ఈడీ కూడా సోమవారం నుంచి దూకుడు పెంచనుంది. దానికి సంబంధించిన దస్త్రాలు పంపాలని ఆ రోజు పురపాలక పట్టణాభివృద్ధి సంస్థకు లేఖ రాయనున్నారు. సర్టిఫైడ్ జిరాక్స్ కాపీలు తీసుకొని ఇందులో విదేశీ సంస్థకు చెల్లింపులు ఎలా జరిగాయని, నగదు లావాదేవీల వివరాలు తీసుకోనున్నారు. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించడంతో పాటు వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకుంటుంది.
ఈడీ పని ప్రారంభించింది - ఫార్ములా ఈ-రేసు అంశంలో కేటీఆర్‌పై కేసు నమోదు
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌పై FIR నమోదుకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ!