ETV Bharat / state

ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం - ఏఈ ఇంట్లో రూ.150 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

నీటి పారుదల శాఖ ఏఈ నిఖేశ్‌ నివాసంలో ఏసీబీ సోదాలు - రూ.150 కోట్ల వరకు ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు

ACB Raids On AE Nikesh Residence
ACB Raids On AE Nikesh Residence (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

ACB Raids On AE Nikesh Residence : అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటి పారుదల శాఖ ఏఈ నిఖేశ్​కు సంబంధించి రూ.150 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి నిఖేశ్‌ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి 30 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. నిఖేశ్‌ పేరిట పలు ఫామ్‌హౌజ్‌లు, వ్యవసాయ భూములు, ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు గుర్తించారు.

ఇందులో మూడు ఫాంహౌజ్‌ల విలువే రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెడ్​హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్​ఈ కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏఈ నిఖేశ్​ గతంలో పట్టుబడ్డాడు. ఒక అనుమతి కోసం దరఖాస్తుదారుడి నుంచి రూ.2,50,000 డిమాండ్ చేసి, ఈఈ బన్సీలాల్, మరో ఏఈ కార్తీక్‌తో కలిసి నిఖేశ్​ ఏసీబీకి చిక్కాడు. అప్పటి నుంచి నిఖేశ్ సస్పెన్షన్‌లో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.