Nizamabad Classical Dancer Abhigna : భారతీయ సంస్కృతిలో నృత్యం గొప్ప కళ. ఇందులో కూచిపూడికి ఉన్న ప్రత్యేకత వేరు. ఆ నృత్య రీతిలోనే అద్భుత ప్రదర్శనలిస్తుందీ కళాకారిణి. ప్రఖ్యాత కళావేదికల పైన ప్రదర్శిస్తూ చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ అఫ్ రికార్డులో చోటు దక్కించుకుని శభాష్ అనిపిస్తోంది.
నటరాజస్వామి ఎదుట నాట్యమాడుతున్న తనుపేరు భారతుల ఉత్తమ అభిజ్ఞ. నిజామాబాద్ జిల్లా బోధన్ స్వస్థలం. తల్లిదండ్రులు ఫణికుమార్, ప్రియాంక. చిన్నప్పుడు కుమార్తె గంతులకు మురిసిపోయి, అమ్మాయిని ఎలాగైనా కళారంగంవైపు నడిపించాలని అనుకుని కూడిపూడిలో శిక్షణ ఇప్పించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మూడేళ్ల వయసులోనే కూచిపూడి వైపు అడుగులేసిన అభిజ్ఞ అనతికాలంలోనే పట్టు సాధించింది.
Classical Dancer Abhigna Amazing Performance : చిన్నవయసులోనే వేదికలపై ప్రదర్శనలిస్తూ ప్రముఖుల ప్రశంసలందుకుంది. తల్లిదండ్రుల సహకారంతోనే చదువు, కూడిపూడి రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది. ఏడేళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుందీ అభిజ్ఞ.
"నేను నా మూడేళ్ల వయస్సు నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను. మా అమ్మా, నాన్నల ఇద్దరూ కూడా క్లాసికల్ డ్యాన్స్‌వైపు వెళ్లేలా పూర్తిగా సహకరించారు. ఆ తోడ్పాటు తోడై నా సాధనతో ఇప్పటికే నేను రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాను. ఈ అవార్డుల రాకతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు." -భారతుల ఉత్తమ అభిజ్ఞ, కూచిపూడి కళాకారిణి
మరెన్నో రికార్డులు సొంతం : ప్రపంచ తెలుగు మహాసభలు, ఇస్కాన్ సంస్థల వేదికలపైనా ప్రదర్శనలతో ప్రశంసాపత్రాలు అందుకుంది. 2 గిన్నిస్ రికార్డులు సహా మార్వలెస్ బుక్, ఇండియా నోబెల్, ఏషియన్ వరల్డ్, ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నానని ఈ కళాకారిణి చెబుతోంది.
చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం పట్ల అభిజ్ఞ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30కి పైగా కూచిపూడి ప్రదర్శనలిచ్చిన అభిజ్ఞను మరింత ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. నృత్యం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు చదువుల్లో రాణిస్తామని అభిజ్ఞ అంటోంది. యువత సెల్‌పోన్లకు పరిమితం కాకుండా కళల వైపు అడుగేయాలని సూచిస్తోంది.
"నేర్చుకోవటమనేది కళ. అది అందరికీ రాదు. కూచిపూడి నాట్యం విషయానికి వస్తే మా పాప చాలా కష్టపడింది. ఈక్రమంలోనే పలు ప్రదర్శనలు చేసి, పలువురు పెద్దలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి నుంచి ప్రశంసలు అందటం ఎంతో గర్వకారణం. తన లైఫ్‌లో మరింత ముందుకు సాగేలే మేము ప్రోత్సహిస్తాం." -ప్రియాంక, అభిజ్ఞ తల్లి
ఫస్ట్ క్లాస్ నృత్యం - ఒకటో తరగతిలోనే 22 అవార్డులు సాధించిన అర్చన
ఆమె నాట్యానికి నటరాజు మైమరిచాడు - వెండితెర ఎర్ర తివాచీ పరిచి మరీ స్వాగతం పలికింది