AAG Ponnavolu Participate To YSRCP Election Campaign: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు అధికారులు వారి ధోరణి మార్చుకోవడం లేదు. కోడ్ అమల్లోకి వచ్చినా నియమావళికి విరుద్ధంగా నడుచుకుంటూ పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. తాజాగా అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (AAG Ponnavolu Sudhakar) వైసీపీ ప్రచారం (YSRCP Political Campaign) లో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ (Election Code) ను సైతం లెక్క చేయకుండా వైసీపీ ప్రచార సభలో పాల్గొనటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. వైసీపీ ప్రచార సభలో ఏఏజీ పాల్గొన్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఎన్నికల వేళ పోలీసుల ప్రత్యేక నిఘా - ఒక్క జిల్లాలోనే రూ. 4.5 కోట్లు సీజ్
వివరాల్లోకి వెళ్తే : నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy), ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి (MLA Prasanna Kumar Reddy) ఆదివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాగా ఆ కార్యక్రమానికి ఏఏజీ పొన్నవోలు హాజరయ్యారు. మండలంలోని పంచేడులో జరిగిన ప్రెస్‌మీట్ వద్ద ఏఏజీ సుధాకర్ హడావుడి చేశారు. ఎన్నికల నిబంధనలకి నీళ్లొదిలిన ఏఏజీ సుధాకర్ రెడ్డి విజయసాయి, ప్రసన్న ఎదుట చేతులు కట్టుకు నిల్చున్నారు. కోడ్ ఉంది వెళ్లిపొమ్మని ప్రసన్న సూచించినా, ఏమవుతుందంటూ అక్కడే ఉండిపోయారు.
యథేచ్ఛగా వాలంటీర్లు ఎన్నికల ఉల్లంఘన - ఈసీ వేటు
ఈసీ ఆదేశాలను లెక్క చేయకుండా వైసీపీ నేతలతో పాటు పాల్గొని స్వామిభక్తి చాటుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో కీలకంగా వ్యవహరించారు ఏఏజీ సుధాకర్ రెడ్డి. హైదరాబాదు, దిల్లీలోనూ ప్రెస్మీట్లు పెట్టి చట్టాల గురించి లెక్చర్లు ఇచ్చిన ఏఏజీ సుధాకర్ రెడ్డి వైసీపీ రంగు పులుముకున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి ఇదేం పనంటూ న్యాయవర్గాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కోడ్ ఉల్లంఘన - తిరుపతిలో యథేచ్ఛగా జాతీయ జెండా స్థూపం నిర్మాణ పనులు