Attack on A Girl in AP : తన ప్రేమను అంగీకరించట్లేదనే కారణంతో యువతిపై ఓ దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో కుళ్లాయప్ప అనే వ్యక్తి ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించిన యువకుడు ఇంట్లోకి చొరబడి ప్రేమించాలని వేధించాడు. యువతి నిరాకరించడంతో కుళ్లాయప్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి క్షణాల్లో పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు యువతిని హుటాహుటిన పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ యువతి శరీరంపైన ఏకంగా 13 కత్తి పోట్లను వైద్యులు గుర్తించారు. బాధితురాలి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పులివెందుల నుంచి కడప రిమ్స్‌కు హస్పిటల్‌కు తరలించారు. బాధిత యువతి డిగ్రీ కోర్సు చదువుతోంది.
కొంతకాలంగా వేధింపులు : కుళ్లాయప్ప అనే యువకుడు తన గ్రామంలో ఖాళీగా ఉంటూ, స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతూ, కాలయాపన చేస్తుంటాడని తెలిసింది. ఈ క్రమంలో యువతి వెంటపడి ప్రేమించాలని కొంతకాలంగా వేధిస్తున్నాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అతని ప్రేమను ఆ యువతి చాలాసార్లు తిరస్కరిస్తూ, దూరం పెడుతు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమించలేదనే కోపంతో ఈ దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కుళ్లాయప్ప కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
'నేను ప్రేమించిన అమ్మాయితోనే మాట్లాడతావా..' ఇంటర్ విద్యార్థిపై ప్రేమోన్మాది దాడి
ప్రేమించిన అమ్మాయిని తనకు దక్కకుండా చేస్తున్నారని కక్ష - యువతి తండ్రిపై ప్రేమోన్మాది కాల్పులు