Trains Cancelled and Rescheduled: సెప్టెంబరు నాలుగో వారం నుంచి రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం కలుగనుంది. 94 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) ప్రకటించడమే ఇందుకు కారణం. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేట ‘ఎఫ్’ క్యాబిన్ మధ్యలో ఇప్పుడు ఉన్న రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలోనే రద్దు నిర్ణయమని ద.మ.రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో కొన్ని రైళ్లు కనిష్ఠంగా ఒక రోజు, గరిష్ఠంగా 15 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని తెలియజేశారు. 41 రైళ్లను దారి మళ్లించి నడుపుతారని పేర్కొన్నారు. మరో 27 రైళ్ల ప్రయాణ వేళలనూ మార్చారని తెలియజేశారు. రద్దయిన వాటిలో గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ వంటి పలు రైళ్లు ఉన్నట్లు వెల్లడించారు. మరికొన్ని రైళ్లు దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించేవి.
రద్దయిన రైళ్లలో ముఖ్యమైనవి ఇవీ :
- కాజీపేట-సిర్పుర్‌టౌన్ (17003) : సెప్టెంబరు 26 - అక్టోబరు 7 వరకు
- సిర్పుర్‌టౌన్-కాజీపేట (17034) : సెప్టెంబరు 27 - అక్టోబరు 8 వరకు
- భద్రాచలంరోడ్-బళ్లార్ష (17033) , బళ్లార్ష-కాజీపేట (17004) : సెప్టెంబరు 29 - అక్టోబరు 8 వరకు
- సికింద్రాబాద్-సిర్పుర్‌కాగజ్‌నగర్, సిర్పుర్‌కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (12757/12758) : సెప్టెంబరు 23 - అక్టోబరు 7 వరకు
- గుంటూరు-సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్-గుంటూరు (17202) : సెప్టెంబరు 23 - అక్టోబరు 8 వరకు
- గోల్కొండ ఎక్స్‌ప్రెస్ : సెప్టెంబరు 23 - అక్టోబరు 8 వరకు
- గుంటూరు-సికింద్రాబాద్ (12705), సికింద్రాబాద్-గుంటూరు (12706) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ : సెప్టెంబరు 23- అక్టోబరు 2 వరకు
- విజయవాడ-సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్-విజయవాడ(12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్ : సెప్టెంబరు 25 - అక్టోబరు 7 వరకు రద్దయ్యాయి.
ప్రయాణికులకు అలర్ట్- ఆ మార్గంలో ఆగస్టు 10 వరకు 24 రైళ్లు రద్దు - Cancellation of 24 Trains in AP