9 Thousand New Btech Seats in Telangana : రాష్ట్రంలో కొత్తగా మరో 9వేల వరకు ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుండగా 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంది. శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఇవ్వనుంది. డిమాండ్ లేని బ్రాంచీల స్థానంలో సీఎస్‌ఈ, ఇతర బ్రాంచీల ద్వారా సుమారు 7,000 సీట్లతో అదనంగా 20,500 కొత్త సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ యోచిస్తోంది.
కొత్త సీట్లను అందుబాటులోకి తీసుకురావడానికి ఏఐసీటీఈ సైతం ఆమెదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలి విడత కౌన్సెలింగ్‌లో సుమారు 2వేల 600 సీట్లకు అనుమతి ఇచ్చింది. రెండో విడతలో సుమారు 9వేల వరకు మంజూరు చేసేందుకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రక్రియను పూర్తి చేశారు. అంటే దాదాపు సగం సీట్లకు కోత పెట్టినట్లేనని కశాశాలల యాజమాన్యాలు అంటున్నాయి.
ప్రతి కాలేజీకి 120 సీట్లు : ప్రస్తుతం బీటెక్‌లో బాగా డిమాండ్ ఉన్న బ్రాంచ్ అంటే సీఎస్‌ఈ. అయితే ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న ఏంటంటే అంతా సీఎస్‌ఈ చదివితే ఎలా అని. 90శాతం సీట్లు భర్తీ చేసిన కళాశాలలకే కొత్తగా 120 సీట్లు ఇస్తామని చెప్పిన విద్యాశాఖ ఈ మేరకు ఇటీవల 2600 సీట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా కాలేజీ యాజమాన్యాల నుంచి ఒత్తిడి రావడంతో 80, 70, 50 శాతం సీట్లను భర్తీ చేసిన కళాశాలలకు కూడా అదనంగా 120 సీట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు పట్టణ/గ్రామీణ, ఓఆర్‌ఆర్ లోపల, బయట, మైనారిటీ నాన్ మైనారిటీ ఇలా రకరకాలుగా కసరత్తులు జరిపింది. చివరికి ప్రతి కళాశాలకు 120 సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో 75,200 మందికి ఇంజినీరింగ్ సీట్లు లభించగా వారు ట్యూషన్ ఫీజ్ చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఈ గడువు ఈ నెల 23వ తేదీన ముగిసింది. తొలివిడత కౌన్సెలింగ్‌లో సుమారు 55,000 మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు. అంటే 20వేల మంది విద్యార్థులు సీట్లు వదులుకున్నారు. వారిలో చాలామంది విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటాలో చేరే అవకాశముందని భావిస్తున్నారు.
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తి
విద్యార్థులకు అలర్ట్! వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ కోర్సులకు కొత్త ఫీజులు - Engineering New Fees