ETV Bharat / state

అంబాజీపేటలో బాహుబలి పనస - 80 కిలోలకుపైగానే! - 80 Kgs Jackfruit in Konaseema - 80 KGS JACKFRUIT IN KONASEEMA

80 Kgs Jackfruit in Konaseema : మామూలుగా పనసను చూస్తేనే పెద్దగా ఉందనే భావన కలుగుతుంది. అలాంటిది ఏకంగా 80 కిలోల బరువున్న పనసను చూస్తే. అన్ని కిలోల పనస అసలు ఉంటుందా అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే ఇంతకీ అంత పెద్ద పనసపండు ఎక్కడుందో తెలుసా ? ఆ బాహుబలి పనస విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

80_kgs_jackfruit_in_konaseema
80_kgs_jackfruit_in_konaseema (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 2:46 PM IST

అంబాజీపేటలో అదరగొడుతున్న పనస- 80 కిలోల బాహుబలి జాక్​ఫ్రూట్​ (ETV Bharat)

80 Kgs Jackfruit in Konaseema : అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఓ చెట్టుకు కాసిన పనస పండు అబ్బుర పరుస్తోంది. 80 కిలోల బరువుతో భారీ పొడవున ఉన్న ఈ బాహుబలి పనస పండు అందరిని ఆకట్టుకుంటోంది. పి.గన్నవరం లంకలలో ఉండే పనస చెట్లనుంచి పనస పండు తెచ్చామని పళ్ల వ్యాపారి చెబుతున్నారు. సాధారణంగా పనసపండు 25 నుంచి 30 కేజీల బరువు మాత్రమే ఉంటుందని ఇది, ఏకంగా 80 నుంచి 90 కేజీల బరువు ఉందని చెబుతున్నారు.

తాము 30 ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంత పెద్ద పనస పండు ఎప్పుడు చూడలేదు అంటున్నారు వ్యాపారులు. అయితే ఒక పనసపండును ఏకంగా ముగ్గురు మోసుకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పనస పండులో సుమారు 800 నుంచి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెబుతున్నాడు.

Jackfruit: విరగ కాసిన పనస.. వామ్మో చెట్టుకు ఎన్ని కాయలో..!

ఈ పనసపండును తిలకించేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు. దీంతో దుకాణ యజమాని కూడా ఈ పనసపండును తమ దుకాణం ముందు ప్రదర్శనకు ఉంచారు. అంబాజీపేట కేంద్రంగా పనస పండ్ల వ్యాపారం జోరుగా జరుగుతుంది. ఈ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు వ్యాపారులు రైతులు పనసపండ్లను ఎగుమతి చేస్తుంటారు.

ఇక్కడి పప్పర పనస కూడా ఒక్కో కాయ రెండున్నర కిలోల నుంచి మూడు కిలోల వరకు బరువు తూగుతోంది. సాధారణంగా కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు పెరుగుతాయని, భూసారంతో పాటు సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పరిమాణం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్పారు. పెరట్లో ఉన్న చెట్లకు ఇలాంటి కాయలు కనిపిస్తాయన్నారు.

బిర్యానీలందు పనసపొట్టు బిర్యానీ వేరయా!

పనస పండుతో ఒక్కటేంటీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో లభించే పండ్లలో పనస కూడా ఒకటి. ఇందులో కూడా వాటర్ కంటెంట్, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఎలాంటి వారైనా పనస పండును తినొచ్చు. పనస పండులోని ప్రతీ భాగంలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పనస కాయ, పనస తొనలు, పనస గింజలు ఇలా అన్నింటినీ తినొచ్చు. అయితే ముఖ్యంగా పనస పండు తినడం వల్ల మగవారికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

Jackfruit reduce diabetes: పనసకాయ పౌడర్​తో మధుమేహానికి చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.