65 Year Old Woman Sexually Assaulted: ఏపీలో 65 సంవత్సరాల వయస్సున్న మహిళపై లైంగిక దాడి జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించ లేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వేపకాయలు ఏరుకుంటున్న మహిళపై ఓ కామాంధుడు దాడి చేసి గాయపరిచిన ఘటనలో బాధిత మహిళ అసువులు బాసింది. ఈ అమానవీయ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
65 సంవత్సరాల ఓ వృద్ధురాలు కుటుంబ జీవనంలో భాగంగా వేపకాయలు ఏరుకోవడానికి వెళ్లింది. ఈమె కదలికలను గమనించిన ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలు అతని వద్ద నుంచి తప్పించుకుని, నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని గురించి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో స్టేషన్ ఎస్ఐ అందుబాటు లేకపోవడంతో ఆమె రాత్రి పది గంటల వరకు స్టేషన్లోనే వేచి ఉంది. అనంతరం స్టేషన్ సిబ్బంది ఉదయం రావాలని ఆమెకు సూచించారు.
పోలీసుల సూచన మేరకు ఆ వృద్ధురాలు ఇంటికి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో నిందితుడు మరోసారి ఆమెపై పైసాచికంగా దాడి చేశాడు. నిందితుడు కొట్టిన దెబ్బలకు ఆమె తట్టుకోలేక, ఇంటిలోనే రాత్రి సమయంలో తుది శ్వాస విడిచింది. ఇదే గ్రామానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి నిందితుడిన తాను స్టేషన్కు తీసుకు వస్తానని చెప్పడంతో, అతనిని పోలీసులు వదిలేశారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రోజు పోలీసులు చొరవ తీసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి కావని వాపోతున్నారు.
ఊయలలో పసికందుపై లైంగికదాడి- విజయనగరం జిల్లాలో దారుణం - Rape on Six Months Baby