4778 Grams of Gold Seized in Hyderabad : కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ముఠాను శనివారం డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4778 గ్రాముల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3.71 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రోడ్డు మార్గం ద్వారా విదేశీ బంగారాన్ని తీసుకువస్తున్నారన్న సమాచారంతో నగరం శివారు ప్రాంతాల్లో రాయికల్ టోల్ ప్లాజా వద్ద కారు అడ్డుకొని అధికారులు సోదాలు చేశారు.
కారు హ్యాండ్ బ్రేక్ దిగువన ప్రత్యేకంగా తయారు చేసిన క్యావిటీలో విదేశీ స్మగ్లింగ్ బంగారాన్ని దాచిపెట్టి తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. కారులో బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురి పైన కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని అధికారులు వెల్లడించారు. కేసు విచారణ కొనసాగుతుందని డీఆర్ఐ అధికారులు తెలియజేశారు.
నడిరోడ్డుపై కారు ఆపి 2.5కిలోల బంగారం చోరీ - Gold Robbery On Road
మత్తు బిస్కెట్లు ఇచ్చి - నైస్‌గా నగలు, నగదు కొట్టేసిన దుండగులు - Gang Stole a Farmer Gold In a Train