ETV Bharat / state

150 ఏళ్ల చరిత్ర - 300 సినిమాల షూటింగ్స్​ - డైరెక్టర్ట్స్ ఫేవరెట్ సినీవృక్షం నేలకొరిగింది - 150 YEARS OLD CINEMA TREE COLLAPSED

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 8:46 AM IST

Updated : Aug 6, 2024, 10:26 AM IST

150 Year Cinema Tree Collapsed in East Godavari : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామం తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆ గ్రామంలో 150 సంవత్సరాలు వయస్సు కలిగిన సినిమా చెట్టుగా పిలువబడే నిద్ర గన్నేరు చెట్టు ఉంది. ఇక్కడ ఏదో ఒక సందర్బంలో వందల సంఖ్యలో సినిమా ఘాటింగ్​లు చేశారు. అలాంటి నిద్రగన్నేరు చెట్టు నేలకొరిగింది.

150 Year Cinema Tree Fallen Down in East Godavari AP
150 Year Cinema Tree Fallen Down (ETV Bharat)

150 Year Cinema Tree Fallen Down in East Godavari AP : అదొక గ్రామం. ఆ గ్రామంలో ఓ చెట్టు. అయితే ఏంటి అని అనుకుంటున్నారా! అసలు విషయం ఇక్కడే ఉందండి. ఆ చెట్టుకు సుమారు 150 ఏళ్ల వయస్సు. అందులో ప్రత్యేకత ఏం ఉంది అని ఆలోచిస్తున్నారా! ఆ చెట్టు ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు కొన్ని వందల సినిమాల్లో నటించింది. చెట్టు నటించడం ఏంటని అనుకుంటున్నారా! అవును 300లకు పైగా సినిమాల్లో కనిపించింది ఈ చెట్టు.

ఆ చెట్టును గురించి తెలుసుకుంటే చాలు, చాలా సినిమా కథలు చెబుతుంది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమాలు అల్లుకుపోయాయి. ఇక్కడ సినిమా తీస్తే కచ్చితంగా హిట్​ అవుతుందని ప్రముఖ దర్శకుంతా నమ్మేవారు. అందుకే ఏదో ఒక సందర్బంలో ఘాటింగ్​లు తీసేవారు. అలా దానికి సినిమా చెట్టు అని పేరు వచ్చింది. ప్రకృతి వైపరీత్యమో, పాలకులు, అధికారులు నిర్లక్ష్యమో ఆ చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది.

నేలకూలిన సినీ వృక్షం : ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన ఈ భారీ వృక్షం నేలకొరిగింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున (ఆగస్టు 5న) పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు.

పాడి పంటలు సినిమాతో ప్రత్యేక గుర్తింపు : ప్రముఖ దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు తదితరులు ఇక్కడ పలు చిత్రాలను రూపుదిద్దారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రనాయకుల సినిమాలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర చిత్రాల్లో ముఖ్యమైన సన్నివేశ పాత్రలు ఇక్కడే నిర్మాణం జరుపుకొన్నాయి.

సినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. ఏటా గోదావరి వరదలకు గట్టు కొద్ది కొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోయింది.

మరో చెట్టుకు ప్రాణప్రతిష్ఠ : గోదావరి నదీ తీరంలోని నిద్రగన్నేరు చెట్టు కూలిపోవడంతో దాని స్థానంలో మరో చెట్టుకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. అక్కడే 20 అడుగుల వృక్షాన్ని నిలిపేందుకు రాజమహేంద్రవరం రైజింగ్​ సంస్థ ఆసక్తి చూపుతోంది.

మినీ ఫారెస్ట్​లా 150 ఏళ్ల మర్రి చెట్టు- బ్రిటిషర్లు నాటారట- 5డిగ్రీల ఉష్టోగ్రత తక్కువే! - 150 Years Old Banyan Tree

మామిడి చెట్టు కొమ్మకు ఒకే చోట 55 కాయలు, ఎక్కడంటే? - 55 Mangoes In a Single Branch

Last Updated : Aug 6, 2024, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.