ETV Bharat / sports

భళా అల్కరాస్‌ - జకోవిచ్​ను ఓడించి రెండోసారి వింబుల్డన్​ టైటిల్​ కైవసం - Wimbledon Mens Singles 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 9:23 PM IST

Updated : Jul 14, 2024, 9:58 PM IST

Wimbledon Mens Singles 2024 : యంగ్ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్‌ వింబుల్డ‌న్ టైటిల్​ను గెలుచుకున్నాడు. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో నొవాక్ జ‌కోవిచ్​ను ఓడించాడు. దీంతో వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు.

Wimbledon Mens Singles 2024
CARLOS ALCARAZ (Associated Press)

Wimbledon Mens Singles 2024 : యంగ్ ప్లేయర్ కార్లోస్ అల్కరాస్‌ వింబుల్డ‌న్ టైటిల్​ను గెలుచుకున్నాడు. ఆదివారం జ‌రిగిన పురుషుల సింగిల్స్‌ ఫైన‌ల్​లో స్టార్ ప్లేయర్ నొవాక్ జ‌కోవిచ్​ను ఓడించాడు. 24 గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచిన జకోవిచ్‌పై 6-2, 6-2, 7-6 (7-4)తో గెలుపొందాడు.

తొలి రెండు సెట్‌లను ఈజీగా గెలిచినప్పటికీ, మూడో సెట్‌లో ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. 6-6తో మూడో సెట్‌ సమం కావడం వల్ల మ్యాచ్‌ ట్రై బ్రేకర్‌కు చేరుకుంది. అందులో కార్లోస్​ 7-4తో జకోవిచ్‌ను ఓడించాడు. ఇక ఈ టోర్నీలో ఛాంపియన్​గా నిలిచిన ప్లేయర్​కు దాదాపు రూ.22 కోట్లు, రన్నర​కు రూ. 12కోట్ల ప్రైజ్​మనీ దక్కనుంది.

టోర్నీ ఎలా జరిగిదంటే?
టోర్ని మొదటి నుంచే అల్కరాస్‌ చాలా కాన్ఫిడెంట్​గా ఆడాడు. తన మూవ్స్​తో ప్రత్యర్థలను కట్టుబెట్టాడు. సెమీఫైన‌ల్స్​లో ఎనర్జిటిక్​గా ఆడి రష్య ఆటగాడు డానిల్ మెద్వెదేవ్​ను ఓడించిన ఈ యంగ్ స్టార్, ఆదివారం స్పెయిన్ కోర్టు వేదికగా జరిగిన పోరులో చెలరేగిపోయాడు. మొదటి సెట్ నుంచి నుంచి జోరుగా ఆడి గెలుపొందాడు. ఇక అదే ఊపుమీద రెండో సెట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సెట్​ తర్వాత జ‌కోవిక్ కాస్త ఒత్తిడిలో ప‌డిపోయాడు. కానీ కాసేపటికే వేగం పుంజుకొని జకోవిచ్ నిలదొక్కుకున్నాడు. దీంతో మూడో సెట్‌ కాస్త ఉత్కంఠగా సాగింది. అయితే నువ్వా నేనా అంటూ సాగిన ఈ గేమ్​లో ఆఖరివరకూ పోరాడి టైటిల్​ను ముద్దాదాడు అల్కరాస్‌​. దీంతో వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. అయితే గతేడాది జరిగిన వింబుల్డన్ ఫైన‌ల్​లోనూ అల్క‌రాస్​ జ‌కోవిచ్​ను ఓడించాడు.

ఇదిలా ఉండగా, ఈ స్టార్ ప్లేయర్లు ఇప్పటిదాకా 5ఈవెంట్లలో తలపడ్డారు. ఈ 5సార్లు కూడా ఇద్దరి మధ్య టఫ్​ఫైట్ జరిగింది. కాగా, అందులో 3సార్లు జకోవిచ్ నెగ్గగా, 2సార్లు అల్కరాస్​ విజయం సాధించాడు. ఇక వింబుల్డన్​లో గతేడాది కూడా ఈ ఇద్దరి మధ్యే ఫైనల్ జరిగింది. ఇందులో 7సార్లు ఛాంపియన్ జకోవిచ్​పై 1-6, 7-6, 6-1, 3-6, 6-4తేడాతో అల్కరాస్​ తొలిసారి టైటిల్ ముద్దాడాడు.

వామ్మో ఎంట్రీ టికెట్ రూ.8.90 లక్షలా- స్పోర్ట్స్ ఈవెంట్​లో ఇదే రికార్డ్ అంట!

వింబుల్డన్‌ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం

Last Updated : Jul 14, 2024, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.