ETV Bharat / sports

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అడుగుపెట్టాలంటే? - రాబోయే 10 టెస్టుల్లో ఎన్ని గెలవాలంటే? - Teamindia WTC Final 2025 - TEAMINDIA WTC FINAL 2025

Teamindia WTC Final 2025 : ప్రస్తుతం టెస్ట్‌ క్రికెట్‌ ఆడే దేశాలన్నీ డబ్ల్యూటీసీ ఫైనల్‌పై కన్నేశాయి. ఇప్పుడు స్టాండింగ్స్‌లో ఇండియా టాప్‌ పొజిషన్‌లో ఉంది. ఆ స్థానం కోల్పోకుండా ఉండాలంటే?

source Associated Press
Teamindia WTC Final (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 8:39 PM IST

Teamindia WTC Final 2025 : ప్రస్తుతం టీమ్‌ ఇండియా సుదీర్ఘ టెస్ట్‌ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. అయితే 2023-25 ​​వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలంటే ప్రస్తుతం సమయం ఇండియాకు చాలా కీలకం. వచ్చే తొమ్మిది నెలల్లో భారత్‌ 10 టెస్టులు ఆడుతుంది. వచ్చే ఏడాది జూన్ 11న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 2023-25 WTC ఫైనల్‌ జరుగుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే భారత్‌ ఎన్ని టెస్టులు గెలవాలి? ఏ జట్టు నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉంది? ఇప్పుడు చూద్దాం.

  • ప్రస్తుతం డబ్ల్యూటీసీ స్టాండింగ్స్‌

1. భారత్ : 9 మ్యాచ్‌లు, 6 విజయాలు, 74 పాయింట్లు, 68.52% (విన్‌ పర్సెంటేజ్‌)

2. ఆస్ట్రేలియా : 12 మ్యాచ్‌లు, 8 విజయాలు, 90 పాయింట్లు, 62.50% (విన్‌ పర్సెంటేజ్‌)

3.న్యూజిలాండ్ : 6 మ్యాచ్‌లు, 3 విజయాలు, 36 పాయింట్లు, 50.00%(విన్‌ పర్సెంటేజ్‌)

4. బంగ్లాదేశ్ : 6 మ్యాచ్‌లు, 3 విజయాలు, 33 పాయింట్లు, 45.83%(విన్‌ పర్సెంటేజ్‌)

5. శ్రీలంక : 7 మ్యాచ్‌లు, 3 విజయాలు, 36 పాయింట్లు, 42.86%(విన్‌ పర్సెంటేజ్‌)

6. ఇంగ్లాండ్‌ : 16 మ్యాచ్‌లు, 8 విజయాలు, 81 పాయింట్లు, 42.19%(విన్‌ పర్సెంటేజ్‌)

7. దక్షిణాఫ్రికా : 6 మ్యాచ్‌లు, 2 విజయాలు, 28 పాయింట్లు, 38.89%(విన్‌ పర్సెంటేజ్‌)

8. పాకిస్థాన్ : 7 మ్యాచ్‌లు, 2 విజయాలు, 16 పాయింట్లు, 19.05%(విన్‌ పర్సెంటేజ్‌)

9.వెస్టిండీస్ : 9 మ్యాచ్‌లు, 1 విజయం, 20 పాయింట్లు, 18.52%(విన్‌ పర్సెంటేజ్‌)

  • భారత్‌కు ఎవరు పోటీ?

న్యూజిలాండ్, 2019-21 డబ్ల్యూటీసీ ఛాంపియన్‌. ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. భారతదేశానికి చాలా దగ్గరగా ఉంది. 50% విన్నింగ్‌ పర్సెంటేజీతో ఫైనల్‌ పొజిషన్‌ కోసం భారత్‌తో పోటీపడవచ్చు.

  • టీమ్‌ఇండియా ఆడబోయే టెస్ట్ మ్యాచ్‌లు(Teamindia WTC Schedule)
    త్వరలో భారత్‌, బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు టెస్టులు ఆడుతుంది. అనంతరం న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల్లో తలపడుతుంది. ఈ హోమ్ గేమ్‌ల తర్వాత, బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం 5 కీలక టెస్ట్‌లు ఆడుతుంది. ఈ సిరీస్ డబ్ల్యూటీసీ పట్టికలో ఎవరు అగ్రస్థానంలో ఉంటారో నిర్ణయించవచ్చు.
  • ఫైనల్‌కు క్వాలిఫై అవ్వాలంటే టీమ్‌ఇండియా ఏం చేయాలి?
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వెబ్‌సైట్‌లోని విశ్లేషణ ప్రకారం, భారతదేశం ప్రస్తుత విన్నింగ్‌ పర్సెంటేజీ 68.52% . దీనిని కొనసాగించడానికి తదుపరి 10 టెస్టులో 7 మ్యాచుల్లో గెలవాలి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే ఐదు టెస్టుల్లోనూ భారత్ క్లీన్ స్వీప్ చేయగలిగితే ఈ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

గత రెండు బోర్డర్-గావస్కర్‌ సిరీస్‌లను గెలుచుకున్న భారత్ ఇటీవల ఆస్ట్రేలియాలో మంచి ప్రదర్శన కనబరిచింది. కాబట్టి, ఆస్ట్రేలియాలో మళ్లీ రెండు విజయాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

WTC పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండేందుకు భారత్‌ విన్నింగ్‌ పర్సెంటేజీని 60% కన్నా ఎక్కువగా ఉంచుకోవాలి. అంటే ప్రస్తుతం ఉన్న 74 పాయింట్లకు మరో 63 పాయింట్లు జోడించాలి.

  • టీమ్‌ ఇండియాకు ఉండే అవకాశాలు?
  • భారత్ తదుపరి 10 టెస్టుల్లో 7 గెలిస్తే, తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
  • ఐదు టెస్టులు గెలిచి, 5 ఓడిపోతే, అప్పటికీ విన్నింగ్‌ పర్సెంటేజీ 60% కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇది ఫైనల్‌కు చేరుకోవడానికి సరిపోతుంది.
  • ఆరు టెస్టులు గెలిస్తే భారత్ విన్నింగ్‌ పర్సెంటేజీ 64.03%కి చేరుతుంది, ఫైనల్‌ చేరే అవకాశాలు ఉంటాయి.
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పరిస్థితి ఏంటి?
    ఆస్ట్రేలియా : ఏడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియాకు తమ విన్నింగ్‌ పర్సెంటేజీ 60% కంటే ఎక్కువగా ఉంచుకోవడానికి నాలుగు విజయాలు లేదా మూడు విజయాలు, ఒక డ్రా అవసరం.

న్యూజిలాండ్ : భారత్‌లో మూడు టెస్టులు సహా న్యూజిలాండ్‌కు ఎనిమిది టెస్టులు మిగిలి ఉన్నాయి. వారు 60% విన్నింగ్‌ పర్సెంటేజీ అధిగమించాలంటే ఆ టెస్టుల్లో ఆరు గెలవాలి. లేదా ఐదు టెస్టులు గెలవాలి, ఒకటి డ్రా చేయాలి.

ఇషాన్ బ్యాక్​ టు ఫామ్- రీ ఎంట్రీలో సెంచరీల మోత - Duleep Trophy 2024

టెస్టు చరిత్రలో ఈ మ్యాచ్​లు వర్షార్పణం - రద్దైనవి ఇవే! - Test Matches Abandoned

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.