ETV Bharat / sports

ఒక్కసారి హెయిర్​కట్​కు విరాట్ అంత ఖర్చు చేస్తాడా? - Virat Kohli Hairstyle Cost - VIRAT KOHLI HAIRSTYLE COST

Virat Kohli Hairstyle Cost : ఏదైనా టోర్నీ మొదలయ్యే ముందు విరాట్ కోహ్లీ కచ్చితంగా కొత్త స్టైల్​తో అభిమానులను ఆకట్టుకుంటుంటాడు. ఈ సారి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు కూడా అలానే మరో కొత్త లుక్​తో అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ మేకోవర్​ కోసం సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్​ ఎంత ఛార్జ్ చేశారంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 7:19 AM IST

Virat Kohli Hairstyle Cost : భారత్​లో మూవీ, స్పోర్ట్స్‌ స్టార్‌లకు క్రేజ్‌ ఎక్కువ. వాళ్ల దుస్తులు, షూలు, వాచ్‌ల నుంచి హెయిర్‌ స్టైల్‌ వరకు అన్నింటినీ ఫ్యాన్స్‌ ఆసక్తిగా గమనిస్తుంటారు. చాలా మంది తమ ఫేవరెట్‌ స్టార్‌ హెయిర్‌ స్టైల్‌ని కాపీ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా టీమ్​ఇండియా, ఆర్సీబీ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ యూనిక్‌ హెయిర్‌ స్టైల్‌, గడ్డం అంటే చాలా మందికి ఇష్టం. మరి విరాట్‌ హెయిర్‌ స్టైల్‌కి ఎంత ఖర్చు పెడుతాడో ఎప్పుడైనా ఆలోచించారా ? తాజాగా కోహ్లీ హెయిర్‌ కట్‌ ధరను ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ వెల్లడించారు.

ఒక్క సెషన్‌కి రూ. లక్ష
బాలీవుడ్ హీరోలు, టాప్‌ ప్లేయర్‌లకు హెయిర్‌ స్టైలింగ్‌ చేస్తూ ఆలిమ్‌ హకీమ్‌ పాపులర్‌ అయ్యారు. హృతిక్ రోషన్ నుంచి రణబీర్ కపూర్ వరకు, క్రికెట్ లెజెండ్ సచిన్ నుంచి కోహ్లీ వరకు అతని క్లయింట్సే. హకీమ్ ఇండస్ట్రీలో టాప్‌ స్టైలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆలిమ్‌ హకీమ్‌ మాట్లాడారు. ఒక్క సెషన్‌కు రూ.1 లక్ష వరకు వసూలు చేస్తానంటూ వెల్లడించారు.

విరాట్‌ ఎప్పుడూ అది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం అని రిఫరెన్సులు ఇస్తూనే ఉంటాడని, ఈ సారి ఐపీఎల్‌ రానుండటం వల్ల కొత్త లుక్‌ ట్రై చేయాలని నిర్ణయించుకున్నామని హకిమ్​ చెప్పారు. అందుకే విరాట్‌ ఐబ్రోస్‌ వద్ద స్లిట్‌ చేశామంటూ వివరించారు. దీంతో పాటు పలు సినిమాల హీరోలకు తను స్టైలిస్ట్​గా వ్యవహరించినట్లు తెలిపారు.

"వార్‌లో హృతిక్ రోషన్ లుక్, యానిమల్‌లో రణబీర్ కపూర్ లుక్, కబీర్ సింగ్‌లో షాహిద్ కపూర్ లుక్, సామ్ బహదూర్‌లో విక్కీ కౌశల్ లుక్, యానిమల్‌లో బాబీ లుక్, జైలర్‌లో రజనీకాంత్ లుక్, బాహుబలిలో ప్రభాస్ లుక్‌ కోసం పడిన కష్టానికి గుర్తింపు లభించింది. ప్రజలు మెచ్చుకున్నారు. దాదాపు 98 శాతం ఇండియన్ సినిమాలు దక్షిణాదినా లేదా ఉత్తరాది అయినా సరే నేను స్టైలిష్​గా వ్యవహరించినవే ఉంటాయి" అని తెలిపారు.

సరికొత్త లుక్స్​లో తారలు ఎవరబ్బా ఆ హెయిర్ స్టైలిష్ట్ భలే ముస్తాబు చేస్తున్నాడుగా

Dhoni New Look : వింటేజ్​ లుక్​లో ధోనీ కొత్త ఫొటోలు.. ఆ స్టార్​ హీరోలానే ఉన్నాడుగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.