Virat Kohli Debut Test Match : ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వన్డే, టీ20, టెస్టులాంటి ఫార్మాట్లలో శైలి మార్చుకుంటూ అదరగొడుతుంటాడు. ఇటీవలే జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లోనే టీమ్ఇండియా తరఫున కొనసాగుతున్నాడు.
డెబ్యూ టెస్టులో 19 పరుగులకే ఔట్
అయితే విరాట్ కోహ్లీ 2011 జూన్ 20న టెస్టు ఫార్మాట్లో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 19 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీని అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఔట్ చేసిన బౌలర్ ఎవరు? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కోహ్లీని ఔట్ చేసింది ఈయనే!
కోహ్లీని టెస్టు అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో విండీస్ బౌలర్ ఫిడేల్ ఎడ్వార్డ్స్ ఔట్ చేశాడు. దీంతో డెబ్యూ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు, అలాగే రెండో ఇన్నింగ్స్‌లో 15 రన్స్ స్కోర్ చేశాడు. అలా మొత్తానికి తన డెబ్యూ మ్యాచ్‌లో కోహ్లీ 19 పరుగులకు వెనుదిరగాల్సి వచ్చింది.
వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత టెస్టులో డెబ్యూ
ఇక విరాట్ కోహ్లీ వన్డేల్లో 2008లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు టెస్టుల్లో అవకాశం దక్కింది. ఆ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని ప్రపంచస్థాయి క్రికెటర్‌గా కోహ్లీ ఎదిగాడు. టీమ్ ఇండియాకు రన్ మెషీన్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అదరగొడుతున్నాడు.
అన్ని ఫార్మాట్లలో అదుర్స్!
తన కెరీర్లో 114 టెస్టులు ఆడిన విరాట్ 8,871 రన్స్ చేశాడు. అందులో 29 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే 295 వన్డేల్లో 13,906 పరుగులు బాదాడు. అందులో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీ20ల్లో 4,188 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 80 సెంచరీలు బాదాడు విరాట్ కోహ్లీ.
విరాట్ ఖాతాలో మరో ఘనత- ఆ మైల్స్టోన్ అందుకున్న నాలుగో బ్యాటర్‌గా రికార్డ్
భారత్‌లోని ఆ 3 మైదానాల్లో టెస్ట్ సెంచరీ చేయని కోహ్లీ - ఎక్కడంటే?