Virat Kohli T20 World Cup : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! అతడిని ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో చూడలేమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అతడికి బీసీసీఐ పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 2024 వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగబోయే టీ20 వరల్డ్ కప్‌నకు విరాట్‌ను కాస్త పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కరేబియన్ దేశంలోని స్లో పిచ్‌లు విరాట్ బ్యాటింగ్‌కు సరిపోదని సెలక్టర్లు భావిస్తున్నారని కథనాల్లో రాసి ఉంది. ఈ విషయంలో విరాట్‌ను ఒప్పించే బాధ్యతను సెలక్టర్ అగార్కర్‌కు అప్పజెప్పినట్లు సమాచారం అందింది.
ఒకవేళ ఇదే కనుక నిజమై కోహ్లీని తప్పిస్తే మాత్రం భారత క్రికెట్‌లో అలజడి రేగడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ అభిమానులు దీనిని అంత తేలికగా తీసుకోరు. రచ్చ చేసే అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు విరాట్ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. మరి ఇలాంటి సమయంలో బీసీసీఐ ఇంత పెద్ద సాహసం చేస్తే పరిణామం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, 2024 టీ20 వరల్డ్ కప్‌ను రోహిత్ శర్మ నేతృత్వంలోనే టీమ్ ఇండియా ఆడుతుందని ఈ మధ్యే బోర్డు సెక్రటరీ జైషా ధృవీకరించారు. అంటే దీంతో హిట్ మ్యాన్ స్థానం ఖాయమైంది. కానీ కోహ్లీ గురించి మాత్రం అలా చెప్పలేదు. సరైన సమయంలోనే విరాట్ గురించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఈ ప్రపంచ కప్‌లోకి వచ్చేందుకు విరాట్ ముందు ఓ దారి ఉంది. అదే ఐపీఎల్. ఇందులో అతడు బాగా రాణిస్తే జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మకి కోహ్లీ అదరగొడితే అప్పుడు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే లాంటి ఆటగాళ్లు టీమ్‌లో బాగా సరిపోతారని నివేదికలు పేర్కొంటున్నాయి.
2024 ఐపీఎల్లో రిషభ్ పంత్ రీఎంట్రీ- ఆ ఇద్దరు స్టార్లు దూరం- బీసీసీఐ క్లారిటీ
టీ20 వరల్డ్‌కప్‌పై ఆసీస్ కన్ను- టీమ్‌లో మార్పులు! కొత్త కెప్టెన్‌గా మిచెల్ మార్ష్?