Vinesh Phogat Haryana Government : అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచే అవకాశం కోల్పోయిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను హరియాణా ప్రభుత్వం విజేతగానే పరిగణించి స్వాగత, సత్కారాలు చేయనుంది. ఈ మేరకు హరియాణా సీఎం నయాబ్‌సింగ్ షైనీ ఓ ప్రకటన చేశారు. ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించిన వారికి ఇచ్చే రివార్డ్‌ను ఆమెకు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. హరియాణా రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.6కోట్ల నగదు, రజతం అయితే రూ.4కోట్ల రివార్డ్, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ఇస్తారు. ఇప్పుడు హరియాణా ప్రభుత్వం కూడా వినేశ్ ఫొగాట్‌ను రజత పతక విజేతగా పరిగణించి, ఆమెకు రూ.4కోట్ల నగదు పురస్కారాన్ని అందజేయనుంది.
हरियाणा की हमारी बहादुर बेटी विनेश फौगाट ने ज़बरदस्त प्रदर्शन करके ओलंपिक में फाइनल में प्रवेश किया था। किन्हीं भी कारणों से वो भले ही ओलंपिक का फाइनल नहीं खेल पाई हो लेकिन हम सबके लिए वो एक चैंपियन है।
— Nayab Saini (@NayabSainiBJP) August 8, 2024
हमारी सरकार ने ये फैसला किया है कि विनेश फौगाट का स्वागत और अभिनंदन एक…
'వినేశ్ - నీ నిర్ణయం మార్చుకో'
ఇక వినేశ్ రిటైర్మెంట్పై రియాక్ట్ అయిన ఆమె ఆమె పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ తన ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని కోరారు. అవసరమైతే తాను ఆమెతో కూర్చొని మాట్లాడతానంటూ మహవీర్ తాజాగా మీడియాకు వెల్లడించారు. అనర్హత వేటు పడిన వెంటనే వినేశ్‌కు మద్దతు తెలిపిన ఆయన వచ్చే ఒలింపిక్స్‌కు తనను సిద్ధం చేస్తానంటూ హామీ కూడా ఇచ్చారు.
"రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆమ ఈ రోజు ఉదయం 5 గంటలకు నాతో చెప్పింది. పతకం సాధించేందుకు ఇంత చేరువగా వచ్చి దాన్ని కోల్పోవడం తనను మానసికంగా ఇబ్బందికి గురిచేసింది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే, ఈ రిటైర్మెంట్ నిర్ణయం నుంచి ఆమె వెనక్కి రావాలని చెబుతున్నాను. కావాలంటే నేను తనతో కూర్చొని ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తాను. మళ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేసి విజేతగా నిలవడం తనకు పెద్ద కష్టమేమి కాదు. ఎవరైనా సరే మెడల్‌కు దగ్గరగా వచ్చి ఇలా జరిగినప్పుడు ఇటువంటి ఆలోచనలే వస్తాయి. అంతేకాకుండా కోపంగా ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు" అని మహవీర్ ఫొగాట్ అన్నారు.
'కుస్తీ గెలిచింది, నేను ఓడాను' - రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్ - Vinesh Phogat Retirement
'వినేశ్ వెయిట్ ఎక్కువుందని WFIకి ముందే తెలుసు'- తప్పంతా కోచ్&స్టాఫ్‌దే!