U19 World Cup 2024 IND vs PAK : పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు ఉండే మజానే వేరు. గతేడాది వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్‌లో ఈ దాయాదుల పోరును ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు మరోసారి భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది సీనియర్ల మధ్య మ్యాచ్ కాదు. యంగ్ టీమ్స్ తలపడుతున్న అండర్ 19 వరల్డ్ కప్‌లో!
ప్రస్తుతం సూపర్ - 6 దశలో ఇండియా - పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లోనే ఉన్నాయి. కానీ, షెడ్యూల్ ప్రకారం గ్రూప్ ఏ లోని జట్లు గ్రూప్ బీలోని టీమ్‌లతోనే పోటీపడాలి. దీంతో భారత్ - పాక్ మ్యాచ్‌ను ఈ దశలో చూసే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఫైనల్‌లో మాత్రం ఆ ఛాన్స్ ఉంది. రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధిస్తే ఇది జరుగుతుంది. ఎలాగో ఇప్పటికే భారత్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఇక తుదిపోరు చేరే రెండో జట్టేదో నేడు(ఫిబ్రవరి 8) తేలిపోతుంది.
రివెంజ్ తీర్చుకోవాలని : వరుసగా ఐదుసార్లు అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది టీమ్‌ఇండియా. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 15 ఎడిషన్లు జరిగాయి. భారత్ 9 సార్లు టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఇందులో ఐదుసార్లు విజయం సాధించింది. కానీ, ఇండియా-పాక్ జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తుదిపోరులో తలపడ్డాయి. అదీ 2006లో. అప్పుడు పాకిస్థాన్ విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్థాన్ ఫైనల్‌కు వెళ్తే రివెంజ్ తీర్చుకోవాలని భారత్ అభిమానులు బలంగా ఆశిస్తున్నారు.
కాగా, ప్రస్తుత ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో పోరాడి మరీ గెలిచిన మన ప్లేయర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక పాకిస్థాన్ కూడా సెమీస్ వరకు ఓటమి లేకుండానే వచ్చింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేం. చూడాలి మరి ఆసీస్‌పై పాక్ గెలిచి ఫైనల్‌లో భారత్‌తో తలపడుతుందో లేదో.
-
What an extraordinary win for the Boys in Blue! Congratulations for their success in the ICC U19 World Cup semi-final 1 against South Africa, driven by Raj Limbani's exceptional performance, taking three wickets along with Uday Saharan and Sachin Das's remarkable… pic.twitter.com/hrUnfY4kIk
— Jay Shah (@JayShah) February 6, 2024
ఇంగ్లాండ్‌తో సిరీస్ - గుబులు పుట్టిస్తున్న కోహ్లీ డెసిషన్!
చరిత్ర సృష్టించిన బుమ్రా- టీమ్‌ఇండియా నుంచి తొలి పేసర్‌గా రికార్డ్