Rinku Singh T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్‌కు 15మంది భారత జట్టులో తమ కుమారుడు ఎంపిక కానందున నిరాశ చెందినట్లు రింకూసింగ్ తండ్రి ఖాన్చంద్ర సింగ్ తెలిపారు. రింకూ కచ్చితంగా వరల్డ్‌కప్ జట్టులో ఉంటాడన్న నమ్మకంతో ఆయన, ముందుగానే మిఠాయిలు, టపాకాయలు కూడా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే జట్టులో చోటు దక్కకపోవడం వల్ల రింకూ ఎంతో బాధపడ్డాడని ఖాన్చంద్ర సింగ్ చెప్పారు.
'రింకూ వరల్డ్‌కప్‌కు సెలక్ట్ అవ్వకపోవడం కాస్త బాధగానే ఉంది. అతడు 11మంది జట్టులోనే ఉండాడన్న నమ్మకంతో మేం ముందుగానే టపాసులు, మిఠాయిలతో సంబరాలు జరుపుకొన్నాం. కానీ, రింకూ జట్టులో సెలక్ట్ కాలేదు. ఈ విషయాన్ని రింకూ తన తల్లికి ఫోన్ చేసి చెప్తూ, తన హార్ట్ బ్రేక్ అయ్యిందంటూ బాధపడ్డాడు' అని ఖాన్చంద్ర సింగ్ తెలిపారు.
కాగా, వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన టీమ్ఇండియా జట్టను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ 15మందిలో రింకూకు స్థానం లభించలేదు. కానీ, ఈ జట్టుతోపాటు నాలుగురితో కూడిన రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను ఎంపిక చేశారు. రిజర్వ్ బెంచ్‌లో రింకూకు చోటు దక్కింది. అయితే రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు కూడా వరల్డ్‌కప్ జట్టుతోనే వెస్టిండీస్, అమెరికా వెళ్తారు. కానీ, వీరికి ప్లేయింగ్ 11లో స్థానం దక్కడం దాదాపు కష్టమే.
ఇటీవల కాలంలో బెస్ట్ ఫినిషర్‌గా పేరు సాధించిన రింకూకు పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడం పట్ల పలువురు మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'ఈ జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడం ఆశ్చర్యకరం. 6 నెలల కిందట జట్టును ఊహించుకుంటే రింకూ పేరు కచ్చితంగా ఉండేది. అయితే ఐపీఎల్లో కేకేఆర్‌లో రింకూకు తగిన అవకాశాలు రాలేదు. దూబే, అక్షర్‌తో పోలిస్తే రింకూ బౌలర్ కూడా కాదు. అందుకే అతడు బలయ్యాడు. వరల్డ్‌కప్‌లో అడే ఛాన్స్ ఒకసారి మిస్తైతే మళ్లీ రాదు' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
టీమ్‌ఇండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్.
ట్రావెలింగ్ రిజర్వ్ : శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్‌ఖాన్.
టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్, రాహుల్ ఔట్ - ICC T20 World Cup 2024
ఇంపాక్ట్ రూల్ వల్లే రింకూ సింగ్‌కు జట్టులో చోటు దక్కలేదా? - T20 World Cup 2024