ETV Bharat / sports

లండన్​ స్ట్రీట్స్​లో విరాట్- కొడుకు అకాయ్​తో చక్కర్లు- వీడియో వైరల్ - Virat Son Akay Kohli - VIRAT SON AKAY KOHLI

Virat Son Akay Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కొడుకు అకాయ్ కోహ్లీని ఎత్తుకొని లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Virat Son Akay Kohli
Virat Son Akay Kohli (Source: Getty Images (Left), Associated Press (Right))
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 5:27 PM IST

Virat Son Akay Kohli: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్​కప్ అనంతరం బ్రేక్ తీసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ రెండు వారాల కిందటే లండన్ పయనమయ్యాడు. ప్రస్తుతం లండన్​లో విరాట్​ ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే క్రికెట్​కు బ్రేక్ తీసుకున్న ప్రతిసారీ విరాట్ పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్​గా మారిపోతాడు.

తాజాగా ఈ ట్రిప్​లోనూ భార్య అనుష్కతో కలిసి లండన్ స్ట్రీట్స్​లో చక్కర్లు కొడుతున్నాడు. అయితే ఈసారి తన కుమారుడు అకాయ్ కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు. విరాట్- అనుష్క తమ కొడుకు అకాయ్ కోహ్లీతో బయటకు వెళ్లారు. ఆ చిన్నారిని విరాట్ ఎత్తుకొని ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే ఈ వీడియో ఎవరో వెనకవైపు నుంచి తీశారు. అందుకే వీడియోలో అకాయ్ మొహం సరిగ్గా కనిపించడం లేదు. దీంతో 'జూనియర్ విరాట్ ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు', 'తరువాత తరం విరాట్' అంటూ కోహ్లీ ఫ్యాన్స్​ కామెంట్లు పెడుతున్నారు. కాగా, 2017లో పెళ్లి చేసుకున్న విరాట్- అనుష్క దంపతులకు 2021లో వామిక అనే ఆడపిల్ల పుట్టింది. ఇక ఇదే ఏడాది ఫిబ్రవరిలో అనుష్క పండంటి బాబు (అకాయ్)కు జన్మనిచ్చింది.

Virat T20 International Career: కాగా, టీ20 వరల్డ్​కప్ తర్వాత విరాట్ పొట్టి ఫార్మాట్ క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. 2010లో టీ20 ఫార్మాట్​లో అరంగేట్రం చేసిన కోహ్లీ దాదాపు 14ఏళ్లపాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్​లో 125 మ్యాచ్​లు ఆడిన విరాట్ 48.7 సగటున,137.04 స్ట్రైక్​ రేట్​తో 4188 పరుగులు చేశాడు. అందులో 38 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. కాగా, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్​కు క్రికెట్​కు వీడ్కోలు పలికిన విరాట్, ఎప్పటిలాగే ఐపీఎల్​లో మాత్రం కొనసాగనున్నాడు.

Virat Kohli Srilanka Tour: టీమ్ఇండియా జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ 3టీ20, 3 వన్డే మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అయితే ఈ టూర్ కోసం విరాట్ తిరిగి టీమ్ఇండియాతో కలవనున్నాడు. వన్డే సీరీస్​లో విరాట్ ఆడనున్నాడు.

'పాక్​కు వస్తే భారత్​ను మర్చిపోయేలా- విరాట్ కోసం మేమంతా వెయిటింగ్'

'కెప్టెన్ అయ్యాక విరాట్ మారిపోయాడు - అతడు మాత్రం అలాంటివాడు కాదు' - Virat Kohli Captaincy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.