Suryakumar Yadav Catch: వెస్టిండీస్ బర్బడోస్ మైదానంలో టీమ్ఇండియా శనివారం చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పొట్టి ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కీలక పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో టీమ్ఇండియా రెండోసారి విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్ ఆటకే హైలైట్‌గా నిలిచింది.
ఛేజింగ్‌లో సౌతాఫ్రికా దూసుకుపోయింది. ఈ క్రమంలో సఫారీ విజయానికి చివరి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజులో డేంజరస్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు బంతినిచ్చాడు. ఆ ఓవర్లో తొలి బంతినే మిల్లర్ భారీ షాట్ ఆడాడు. బంతి అమాంతం గాల్లోకి లేచి సిక్సర్వైపు దూసుకుపోయింది. లాంగాన్ ఫీల్డింగ్‌లో ఉన్న సూర్య వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అసాధారణ రీతిలో బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో సూర్య కంట్రోల్ తప్పాడు. బంతిని గాల్లోకి విసిరి, బౌండరీ గీత దాటాడు. వెంటనే మళ్లీ బంతిని అందుకొని క్యాచ్‌ను పూర్తి చేశాడు. అంతే టీమ్ఇండియా ప్లేయర్లు, అభిమానులు ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. ఒకవేళ సూర్య ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది.
What A Catch By Suryakumar Yadav 🔥🔥
— Elvish Army (Fan Account) (@elvisharmy) June 29, 2024
Game changing catch 🥹❤️
Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/2GGj4tgj7N
అందుకుంది క్యాచ్ కాదు కప్పు!
సూపర్మ్యాన్లా క్యాచ్ అందుకున్న సూర్యపై ప్రశంసలు వెల్లువెత్తాయి. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ విన్నింగ్ షాట్ సిక్సర్‌గా ఇది కూడా చరిత్రలో నిలిచిపోతుందంటూ మెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ సూర్యపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'సూర్య క్యాచ్ కాదు, ఏకంగా ఐసీసీ ట్రోఫీనే అందుకున్నాడు' అంటూ మీమ్స్ చేసేస్తున్నారు.
In 1999, Harschelle Gibbs not just dropped catch of Steve Waugh; he dropped the World Cup too!
— Kiran Khedeka₹ (@Kiran_Khedekar) June 29, 2024
Exactly opposite, Suryakumar Yadav won #TeamIndia #T20IWorldCup here by catching! ❤️#INDvSA pic.twitter.com/DmC0xSvEVm
బ్యాట్‌తోనూ అదుర్స్
ఈ ప్రపంచకప్ టోర్నీ సూర్య బ్యాట్‌తోనూ రాణించాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 199 పరుగులు చేశాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో జట్టు 2వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్‌తో మంచి భాగస్వామ్యం నిర్మించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 47 పరుగులు బాదాడు. ఇక టోర్నీ మొత్తంలో రెండుసార్లు 50+ స్కోర్లు చేశాడు.
ఛాంపియన్‌గా భారత్- రోహిత్, విరాట్ ఎమోషనల్- గోల్డెన్ మూమెంట్స్ చూశారా? - T20 World Cup 2024
టీమ్ఇండియాకు బిగ్ ప్రైజ్‌మనీ- టోర్నీలో హైలైట్స్ ఇవే! - T20 World Cup 2024