Harbhajan Singh World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో కీలక సూపర్ 8 మ్యాచ్‌లకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మెగా టోర్నీలో భారత్ పెర్ఫార్మెన్స్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ స్టార్ట్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. భారత్‌కి రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య బిగ్గెస్ట్ పాజిటివ్స్ అని పేర్కొన్నాడు. ఇప్పటివరకూ ఇద్దరూ కీలక పాత్ర పోషించారని చెప్పాడు. 'బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే హార్దిక్ పాండ్య వికెట్లు పడగొట్టడం. ఈ టోర్నీలో అతడు నాలుగో బౌలర్. కానీ అతడు తీసిన వికెట్ల సంఖ్యను పరిశీలిస్తే, అతడి నుంచి ఆశించిన దాని కంటే ఎక్కువగానే రాణించాడు' అని అన్నాడు.
పంత్ బ్యాటింగ్ గురించి కూడా మాట్లాడాడు. 'లెఫ్ట్- రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కోసం పంత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో వస్తున్నాడు. టోర్నమెంట్‌లో అత్యుత్తమ బ్యాటర్లు కూడా పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతుంటే, బౌలర్లపై పంత్ ఎదురు దాడి చేశాడు. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో కీలక పరుగులు చేశాడు. రిషబ్ పంత్‌ను మూడో స్థానంలో ఆడించడం బిగ్ పాజిటివ్' అని హర్భజన్ అన్నాడు. 'చాలా పాజిటివ్‌లు ఉన్నాయి. వాస్తవానికి, సవాళ్లు, ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే ధైర్యం ఉన్న వారి ముందుకే సవాళ్లు వస్తాయి. భారత్, బ్రేవ్ ప్లేయర్స్ ఉన్న టీమ్. అద్భుతంగా పోరాడారు. చాలా బాగా ఆడారు. అందుకే గ్రూప్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నారు' అని వివరించాడు.
అక్కడ ఫెయిల్, ఇక్కడ పాస్: అయితే ఐపీఎల్‌లో ముంబయి కెప్టెన్ హర్దిక్ పాండ్య గొప్పగా రాణించలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో ఆకట్టుకోలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడంపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు పాండ్య టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. అతని ఫిట్‌నెస్‌పై వచ్చిన విమర్శలకు తన పెర్ఫార్మెన్స్‌తో చెక్ పెట్టాడు.
రీ ఎంట్రీలో అదుర్స్: మరో వైపు 2022లో రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ ఐపీఎల్ 2024లో ఆడాడు. బ్యాటింగ్, కీపింగ్‌లో ఆకట్టుకున్నాడు. తీవ్ర పోటీ ఉన్న కీపర్- బ్యాటర్ పొజిషన్‌కి సెలక్ట్ అయ్యాడు. చాలా కాలం తర్వాత ఆడుతున్న మెగా టోర్నీలో రాణిస్తున్నాడు. టీమ్ ఇండియాలో అత్యధిక స్ట్రైక్ రేటు 124.67తో పరుగులు చేస్తున్నాడు.
సూపర్-8కు చేరుకున్న జట్లు ఇవే- టీమ్ఇండియా ఎవరితో తలపడనుందటే? - T20 world cup 2024