T20 WorldCup 2024 Teamindia Jim : ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్ 2024కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. విండీస్‌తో కలిసి అమెరికా తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. అయితే యూఎస్‌ఏ ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్లేయర్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ విఫలమైందంటూ విమర్శలు అందుకుంటోంది. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే - టీమ్ఇండియా ప్లేయర్స్ న్యూయార్క్‌లోనే వార్మప్ మ్యాచ్‌తో పాటు రెండు మ్యాచ్‌లను ఆడారు. మరో మ్యాచ్‌ను అక్కడే యూఎస్‌ఏతో పోటీపడనున్నారు. అయితే వీటి కోసం బయటి పార్కుల్లోనే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడే అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది మరువకముందే సదుపాయాలకు సంబంధించి మరొక విషయం బయట కొచ్చింది.
అదేంటంటే న్యూయార్క్‌లో టీమ్ఇండియా ప్లేయర్స్ బస చేస్తున్న హోటల్‌లో జిమ్ చేసుకోవడానికి సరైన ఎక్విప్‌మెంట్ లేదట. దీంతో మన ఆటగాళ్లు బయట ఉన్న జిమ్‌లో మెంబర్‌షిప్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం ఇంగ్లీష్ మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. "హోటల్‌లోని జిమ్‌ను ప్లేయర్స్ వాడుకోవట్లేదు. అక్కడ సరైన సదుపాయాలు లేవు. దీంతో దగ్గరలోని ఓ జిమ్‌లో వారంతా మెంబర్‌షిప్ తీసుకోవాల్సి వచ్చింది. అది వరల్డ్ వైడ్‌గా జిమ్ చైన్ కలిగిన సంస్థ. ప్రతి ఒక్కరూ దానిని ఉపయోగించుకున్నారు" అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
కాగా, అమెరికాలో క్రికెట్‌కు ఎక్కువగా ఆదరణ లేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ క్రికెట్‌ను విస్తరించేందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే టీ20 వరల్డ్ కప్ 2024 సహ ఆతిథ్య బాధ్యతలను యూఎస్ఏకు అప్పగించింది. కానీ అమెరికా మాత్రం సరైన సౌకర్యాలు కల్పించలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఏ జట్టు కూడా అధికారికంగా కంప్లైంట్ చేయలేదు. మరోవైపు ఎటువంటి అంచనాలు లేని యూఎస్‌ఏ క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శనతో క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటోంది. బలమైన పాకిస్థాన్ జట్టును ఓడించి తన సత్తా ఏంటో నిరూపించింది. తద్వారా సూపర్ - 8 రేసులో నిలిచింది.
పాక్ ప్లేయర్లకు భారీగా జీతాలు పెంపు! - Pakisthan Cricketers Salaries
భారత్ Vs భారత్- ఆతిథ్య జట్టుతో మ్యాచ్లో రోహిత్ సేనకు తిరుగుందా? - T20 WORLD CUP 2024