ETV Bharat / sports

బాబర్​ను దాటేసిన రోహిత్​ - భారత్​xఆసీస్​ మ్యాచ్​లో నమోదైన రికార్డులివే - T20 Worldcup 2024 - T20 WORLDCUP 2024

T20 Worldcup 2024 Super 8 Teamindia VS Australia : తాజాగా జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి సెమీస్​లో అడుగుపెట్టింది భారత్​. అయితే ఈ పోరులో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

source ETV Bharat
Teamindia VS Australia (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 7:28 AM IST

T20 Worldcup 2024 Super 8 Teamindia VS Australia : టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ - 2024 సెమీ ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీ సూప‌ర్‌-8లో భాగంగా తాజాగా సెయింట్ లూసియా వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 24 ప‌రుగుల తేడాతో ఘన విజ‌యం సాధించింది. దీంతో గ్రూపు-1 నుంచి త‌మ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇదే పోరులో 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

  • తాజా మ్యాచ్​తో కలిపి టీ20ల్లో రోహిత్‌ 4165 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ (4145)ను బ్రేక్ చేశాడు.
  • ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 8 సిక్సర్లు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్​ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా యువరాజ్‌ సింగ్‌ (2007లో 7) రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200 కన్నా ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్​ రోహితే (203) కావడం విశేషం. గప్తిల్‌ (173) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
  • ఈ మ్యాచ్​లో రోహిత్‌ శర్మ హాఫ్​ సెంచరీ అందుకున్నప్పుడు జట్టు పరుగులు 52. ఓ ప్లేయర్​ హాఫ్ సెంచరీ చేసిన సమయంలో ఓ జట్టు చేసిన అత్యల్ప రన్స్ ఇవే కావడం గమనార్హం.
  • రోహిత్ శర్మ హాఫ్​​ సెంచరీ చేయడానికి తీసుకున్న బంతులు 19. టీ20ల్లో ఇదే అతడి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. టీ20ల్లో ఆసీస్​పై అత్యంత వేగంగా అర్ధ శతకం చేసిన ప్లేయర్​గా యువరాజ్ సింగ్​, పోలార్డ్‌ (20)లను వెనక్కినెట్టాడు. ఈ టోర్నీలో వేగవంతమైన అర్ద శతకం ఇదే.
  • ఈ మ్యాచ్‌లో రోహిత్‌ స్కోరు 92. టీ20 ప్రపంచకప్‌ల్లో టీమ్​ఇండియా తరఫున రైనా (2010లో సౌతాఫ్రికాపై ఇదే మైదానంలో 101) తర్వాత అత్యధిక స్కోరు హిట్​మ్యాన్​దే. 2010లో గేల్‌ టీమ్​ఇండియాపై 98 తర్వాత అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌ రోహిత్​ శర్మే.

ఆస్ట్రేలియాకు టీమ్​ఇండియా చెక్‌ - అజేయంగా సెమీస్‌లోకి ఎంట్రీ - T20 WORLD CUP 2024

ఆసీస్​పై రోహిత్ దండయాత్ర- సిక్సర్లతో హిట్​మ్యాన్ విధ్వంసం - T20 World Cup

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.