T20 Worldcup 2024 Afghanistan : ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ఆటను వర్ణించానికి మాటల్లేవ్. ఇంతటి పోరాట తత్వం, ఇంత కసి వారిలో ఎవరు నింపారో అని క్రికెట్ ప్రపంచమంతా విస్తుపోతోంది. సరైన వసతులు, వనరులు లేకున్నా, ప్రతిభ, పట్టుదల, పోరాటమే ఆయుధాలుగా వారు ఎదిగిన తీరు, సాధిస్తున్న విజయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
నిజానికి నిన్న మొన్నటి వరకు అఫ్గాన్‌ను పసికూన అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ చెరిగిపోయింది. ఇప్పుడు ఏ పెద్ద జట్టు కూడా ఆ జట్టును తక్కువ అంచనా వేయడం లేదు. ఎందుకంటే ఆ జట్టే ఇప్పుడు ఇంగ్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లపై విజయాలు సాధించింది. ఈ ప్రపంచకప్‌లో కివీస్‌ను ఏకంగా 84 పరుగుల తేడాతో ఓడించి ఆ జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. సూపర్-8లో ఆస్ట్రేలియానే 21 పరుగుల తేడాతో ఓడించి ఆ టీమ్ ఇంటిముఖం పట్టేలా చేసింది.
అయితే అఫ్గానిస్థాన్ విజయాలను ఆ దేశంలోనే కాదు మన దేశంలోనూ ఆస్వాదిస్తున్నారు! ఎందుకంటే ప్రపంచ క్రికెట్‌లో అఫ్గాన్ ఎదుగుదలలో భారత్ పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. ఆ జట్టుకు స్టేడియాలు, ప్రాక్టీస్ సౌకర్యాలు అందించింది. అలానే కొన్ని సిరీస్‌లకు ఇక్కడి నుంచే ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కల్పించింది.
భారత మాజీ క్రికెటర్లు కూడా వారికి కోచింగ్ ఇచ్చారు. మనోజ్ ప్రభాకర్, లాల్‌చంద్ రాజ్‌పుత్, అజయ్ జడేజాలు గతంలో ఆఫ్గానిస్థాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. వన్డే ప్రపంచకప్-2023 వరకు జడేజా ఆ జట్టు మెంటర్‌గా ఉన్నాడు.
పాకిస్థాన్‌తో ఉన్న వైరం వల్ల కూడా అఫ్గాన్‌ను దగ్గరయ్యేలా చేసింది. అఫ్గాన్ అంటే మన జట్టు అనే భావన కలుగుతుంది.
2003, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌తో పాటు 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ టీమ్ఇండియాను ఓడించి ఆస్ట్రేలియాను ఈసారి సెమీస్ చేరకుండా చేసింది అఫ్గానిస్థాన్. ఇందులో సగం పాత్ర రోహిత్ సేన పోషిస్తే మిగతా సగం పని అఫ్గానిస్థాన్ పూర్తి చేసింది.
ఇకపోతే ఐపీఎల్ కూడా అఫ్గాన్ క్రికెటర్లు రాటుదేలేందుకు బాగా సహకరించిందనే చెప్పాలి. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌తో సహా పలువురు ప్లేయర్స్ ఐపీఎల్‌లోని పలు జట్లలో ఆడుతున్నారు. దీంతో వారికి అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడే అవకాశం కలుగుతోంది. అలా వారు క్రికెట్ మెలకువలు మరింత తెలుసుకుంటున్నారు.
𝐓𝐡𝐢𝐬 𝐕𝐈𝐂𝐓𝐎𝐑𝐘 𝐦𝐞𝐚𝐧𝐬 𝐭𝐡𝐞 𝐰𝐨𝐫𝐥𝐝 𝐭𝐨 𝐮𝐬! 🤩👏
— Afghanistan Cricket Board (@ACBofficials) June 25, 2024
Congratulations to the entire nation! 🙌#AfghanAtalan | #T20WorldCup | #AFGvBAN | #GloriousNationVictoriousTeam pic.twitter.com/R2vJKNiAHG