ETV Bharat / sports

వరల్డ్ కప్​ - తొలి మ్యాచ్​కు భారీ అడ్డంకి! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

T20 WorldCup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి రంగం సిద్దమైంది. అయితే తొలి మ్యాచ్​కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
T20 WorldCup 2024 (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 7:36 PM IST

T20 WorldCup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీ తెరలేవనుంది. జూన్​ 2న(ఆదివారం) జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా, కెనడా పోటిపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం ఈ పోరుకు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముపు పొంచి ఉందని తెలిసింది. ఇప్పటికే ఈ మైదానం వేదికగా జరగాల్సిన వార్మప్​ మ్యాచుల్లో మూడు వర్షార్పణం అయ్యాయి.

America VS Canada : ఈ స్టేడియంలో నేపా‌ల్‌ - కెనడా మధ్య జరిగిన తొలి వార్మప్​ మ్యాచులో కెనడా 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరగాల్సిన బంగ్లాదేశ్ - అమెరికా, అమెరికా - నేపాల్, నెదర్లాండ్స్ - కెనడా వార్మప్​ మ్యాచ్‌లు బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు జూన్ 2న జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2024 తొలి మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ పోరు కూడా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం టెక్సాస్‌లో ప్రతీ రోజు వర్షం పడుతోంది. దీంతో తొలి మ్యాచ్ జరిగే జూన్2న కూడా వర్షం పడే ఛాన్స్​ ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఆ రోజు టెక్సాస్‌లో 21 నుంచి 24 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. ఆ రోజంతా ఆకాశానికి మబ్బులు కమ్ముకోనున్నాయని అంటున్నారు.

కాబట్టి స్వల్ప స్థాయిలో వర్షం పడినా కూడా మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్​లు ఉన్నాయి. ఎందుకంటే ప్రతీ రోజు వర్షం పడుతుండటం వల్ల ఇప్పటికే స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో ఆ రోజు స్వల్ప స్థాయిలో వర్షం పడినా ఆటకు మైదానాన్ని సిద్దం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, భారత్ తన తొలి మ్యాచ్​ను జూన్ 5న ఐర్లాండ్​తో ఆడనుంది.

ఆ స్టార్ క్రికెటర్​కు హిట్​మ్యాన్ సూచనలు - హార్దిక్ ప్లేస్​లో ఛాన్స్!​ - T20 World Cup 2024

ఈ ప్లేయర్లు యమ డేంజరెస్​ - భయపెట్టేందుకు వచ్చేస్తున్నారు! - T20 WorldCup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.