T20 World cup 2024 USA Squad : టీ20 ప్రపంచకప్ - 2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును యూఎస్ఏ క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. ఈ టీమ్‌కు మోనాంక్ పటేల్ కెప్టెన్సీ వహించనున్నాడు. రీసెంట్గా కెనెడాతో జరిగిన టీ20 సిరీస్‌లో 4-0తేడాతో విజయం సాధించింది యూఎస్ఏ జట్టు. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేశారు సెలెక్టర్లు. కెనెడా సిరీస్‌కు తొడ కండరాల గాయంతో దూరమైన అలీ ఖాన్‌ను కూడా సెలెక్ట్ చేశారు. బౌలింగ్ విభాగానికి ఇతడు బలం. ఇతడు ఇతర దేశాలకు చెందిన లీగ్‌లలోనూ అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు.
అలానే ఈ జట్టులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ అండర్సన్‌కు కూడా చోటు దక్కింది. 2014, 2016 టీ20 ప్రపంచకప్ జట్టులో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు అండర్సన్. అయితే గత ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ నుంచి ఎన్‌వోసీ తీసుకున్న అతడు అమెరికాకు షిఫ్ట్ అయిపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పుడతడికి సెలక్టర్లు ప్రపంచ కప్ జట్టులో అవకాశం ఇచ్చారు.
ఇంకా ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఐదుగురు ప్లేయర్స్‌కు కూడా స్థానం లభించింది. కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు నిసర్గ్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, నితీష్ కుమార్, మిలింద్ కుమార్ భారత మూలాలు కలిగి ఉన్నవారే. అయితే ఈ జట్టులో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా, ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అమెరికా తన తొలి మ్యాచ్‌ను జూన్ 1న డల్లాస్ వేదికగా కెనడాతో పోటీ పడనుంది.
అమెరికా వరల్డ్‌కప్ జట్టు - మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరీ ఆండర్సన్, ఆండ్రీస్ గౌస్, హర్మీత్ సింగ్, అలీ ఖాన్, మిలింద్ కుమార్, జెస్సీ సింగ్, నితీష్ కుమార్, నిసర్గ్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, నోష్టుష్ కెంజిగే, స్టీవెన్ టేలర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, షయాన్ జహంగీర్.
ముంబయిపై కోల్‌కతా విజయం - 12ఏళ్ల తర్వాత తొలిసారి! - IPL 2024
టీ20 వరల్డ్‌కప్‌కు అంపైర్లు ఫిక్స్- అతడు మళ్లీ వచ్చాడేంట్రా బాబు! - T20 World Cup 2024