T20 World Cup 2024 Live : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే వీటిని ఎలా వీక్షించాలని ఆలోచిస్తున్న భారత అభిమానులకు ఊరట కలిగించింది ఐసీసీఐ. ఇప్పటికే భారత వ్యూవర్స్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా షెడ్యూల్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ ఆడే మ్యాచ్‌లను ఇక్కడి అభిమానుల సౌలభ్యం కోసం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యేలా చూసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎందుకుంటే ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో భారత మ్యాచ్‌లు జరిగితే, వాటిని వీక్షించే అభిమానులు సంఖ్య పడిపోతుంది. దీంతో ప్రకటనలు, ఇతర మార్గాల ద్వారా ఐసీసీకి వచ్చే ఆదాయం కుడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్‌లను మాత్రం భారత కాలమానం ప్రకారం షెడ్యూల్ చేసింది ఐసీసీ.
ఇదిలా ఉండగా, ఒకవేళ భారత్ సెమీస్ లేదా ఫైనల్ చేరితే, ఆ మ్యాచ్‌లు కూడా అక్కడ ఉదయం 10.30 గంటలకే ఆరంభమవుతాయి. ఇక్కడ మనం రాత్రి 8 గంటల నుంచి వీటిని చూడొచ్చు. సాధారణంగా ఫైనల్ మ్యాచ్‌లు అక్కడ రాత్రి నిర్వహిస్తారు. కానీ భారత అభిమానులకు ప్రాధాన్యతనిచ్చిన ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
భారత కాలమానం ప్రకారం ఇతర జట్లు ఆడే కొన్ని మ్యాచ్‌లు ఉదయం 5, 6, రాత్రి 9, 10:30, 12:30 గంటలకు ప్రారంభమవుతున్నాయి. కెనడా- అమెరికా మధ్య టోర్నీ ఆరంభ మ్యాచ్ అక్కడి కాలమానం ప్రకారం జూన్ 1న శనివారం రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అదే మన కాలమానం ప్రకారం ఆ మ్యాచ్ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జరుగుతుంది. ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈ లైవ్ స్ట్రీమ్ కానుంది. అంతే కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
టోర్నమెంట్ విధానం - అయితే ఈ టోర్నమెంట్లో ఆడే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. ఈ గ్రూపులోని ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఆడాల్సిందే. అలా ఆడి టాప్ 2లో నిలిచిన నాలుగు గ్రూపుల్లోని జట్లన్నీ కలిపి సూపర్ 8గా మారతాయి. మళ్లీ వాటిని రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్కడ కూడా టాప్ 2 సాధించిన ఇరు జట్లలోని నాలుగు టీంలు కలిపి సెమీఫైనల్‌లో పాల్గొంటాయి. ఏయే గ్రూపులో ఏయే జట్లు ఉన్నాయంటే.
గ్రూపు ఏ : భారత్, ఐర్లాండ్, కెనడా, పాకిస్తాన్, అమెరికా
గ్రూప్ బీ : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
గ్రూప్ సీ : ఆఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్
గ్రూప్ డీ : బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
-
Just 1️⃣ day until the hunt for the biggest prize begins! 🏆
— Star Sports (@StarSportsIndia) June 1, 2024
As we eagerly anticipate the #T20WorldCup, let’s reminisce about #TeamIndia’s unforgettable dream run in the inaugural ICC Men's T20 World Cup! 🌟🇮🇳
Tune in to #T20WorldCupOnStar, 2nd June onwards on the Star Sports… pic.twitter.com/kva8ePBZtB
మినీటోర్నీలో టీమ్ఇండియా జర్నీ- ఆ 3ఎడిషన్లలో హార్ట్‌బ్రేక్! - T20 World Cup 2024
అమెరికాలో క్రికెట్ ఆడతామని ఊహించలేదు : విరాట్ కోహ్లీ - T20 World Cup 2024