T20 Player Of The Year 2023: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ '2023 టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచాడు. 2023లో పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదకర్శన కనబర్చిన సూర్యను ఐసీసీ బుధవారం ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. కాగా, 2022లోనూ ఈ అవార్డు సూర్యనే వరించింది. దీంతో వరుసగా రెండుసార్లు ఉత్తమ టీ20 ప్లేయర్ అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు సూర్య. అటు టీ20 ర్యాకింగ్స్‌లోనూ సూర్య అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 869 రేటింగ్స్‌తో సూర్య టాప్‌లో ఉన్నాడు.
-
PHOTO | Indian batter Suryakumar Yadav named ICC T20 player of the year for second successive time.
— Press Trust of India (@PTI_News) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
(PTI File Photo) pic.twitter.com/iKzb63oS1Y
">PHOTO | Indian batter Suryakumar Yadav named ICC T20 player of the year for second successive time.
— Press Trust of India (@PTI_News) January 24, 2024
(PTI File Photo) pic.twitter.com/iKzb63oS1YPHOTO | Indian batter Suryakumar Yadav named ICC T20 player of the year for second successive time.
— Press Trust of India (@PTI_News) January 24, 2024
(PTI File Photo) pic.twitter.com/iKzb63oS1Y
సూర్య@2023: 2023 ఏడాదికిగాను ఉత్తమ టీ20 క్రికెటర్ల రేసులో సూర్యతోపాటు జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా (515 పరుగులు, 17 వికెట్లు), న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ (576 పరుగులు) ఉగాండ ఆటగాడు అల్పేశ్ ( 55 వికెట్లు) ఉన్నారు. వీళ్లలో సూర్యనే ఈ అవార్డు వరించింది. గతేడాది పొట్టి ఫార్మాట్లో సూర్య అదరగొట్టాడు. అతడు 17 ఇన్నింగ్స్‌ల్లో 48 సగటుతో 733 పరుగులు బాదాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 155గా ఉంది. అలాగే 2023లో సూర్య రెండు టీ20 సిరీస్‌లకు టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాతో 4-1 తేడాతో సిరీస్ నెగ్గగా, సౌతాఫ్రికాతో 1-1తో డ్రా గా ముగిసింది.
ICC T20 Cricketer Of The Year: ఐసీసీ 2021 నుంచి క్రికెటర్లకు ఉత్తమ టీ20 అవార్డులు ఇస్తోంది. అయితే 2021లో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డుకు ఎంపికవ్వగా, 2022, 2023లో వరుసగా రెండుసార్లు సూర్య దక్కించుకున్నాడు.
Surya Kumar Yadav ICC T20 Team: ఐసీసీ రీసెంట్గా ఉత్తమ టీ20 జట్టును ప్రకటించింది. ఐసీసీ ఆ జట్టుకు సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా ఎంపికచేసింది. ఇక ఆ జట్టులో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కింది. దీంతో 2023 టీ20 ఉత్తమ జట్టులో నలుగురు భారత ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు.
2023 ఉత్తమ టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, నికోలస్ పూరన్, ఫిల్ సాల్ట్, సికిందర్ రాజా, మార్క్ చాప్‌మన్, మార్క్ ఐదెర్, రవి బిష్ణోయ్, రామ్‌జని, అర్ష్‌దీప్ సింగ్, రిచర్డ్ ఎన్‌గరవ.
-
India's white-ball dynamo headlines the ICC Men's T20I Team of the Year for 2023 🔥
— ICC (@ICC) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Check out who made the final XI 👇https://t.co/QrQKGYbmu9
">India's white-ball dynamo headlines the ICC Men's T20I Team of the Year for 2023 🔥
— ICC (@ICC) January 22, 2024
Check out who made the final XI 👇https://t.co/QrQKGYbmu9India's white-ball dynamo headlines the ICC Men's T20I Team of the Year for 2023 🔥
— ICC (@ICC) January 22, 2024
Check out who made the final XI 👇https://t.co/QrQKGYbmu9
ICC టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ - కెప్టెన్‌గా సూర్య భాయ్
రవిశాస్త్రికి బీసీసీఐ అరుదైన పురస్కారం- శుభ్‌మన్ గిల్‌కు పాలి ఉమ్రిగర్ అవార్డు